Friday, June 10, 2011

కోతి చేష్ఠలు - అనే నానుడి


















కోతీ! కోతీ!  కొమ్మచ్చీ! 
నీకూ పెడతా అప్పచ్చి!


కోతీ! కొమ్మల ఊగేవు
గొందుల, తూముల దూరేవు; 
వలేసి, పడితే గగ్గోలు!


తోకలు పట్టుకు లాక్కుంటే; 
మీ గుంపు ఆటలు భలే వినోదం! ;


పేలు తీయుటలో పై నేర్పరులంట!లు ; 
కోతి చేష్ఠలు - అనే నానుడి; 
మీ వలనే ఏర్పడెనౌరా! జగతిని!


అత్త కుండలను; నేలకు విసరీ, 
పుట్టింటి కడవలను నెత్తినెట్టుకొను; 
టక్కరి కోతీ! అమ్మ దొంగా!!!!!!


అలనాడు, 
సంద్రంపైన అంత సేతువును 
ఎలాగ కట్టీ, -
శ్రీ రాముల మెప్పును పొంద గలిగితివి?


కోతీ! కోతీ!  కొమ్మచ్చీ! 
నీకూ పెడతా అప్పచ్చి!


&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment