Wednesday, May 4, 2011

స్వామిని “నట రాజు”గ నిలిపినావు


















జనని! త్రిభువన పోషిణీ!
త్రైలోక్య శుభదాయినీ!
జయ మంగళం!అమ్మ!
జయ మంగళం! జయ మంగళం             ||

సలలిత రాగములు చిలుకంగా
అతులిత గానము సాగంగా
సరి గంగ వాహినీ లహరికలు ఎగయంగా
పతి ఈశునితో అఖండ నాట్యములు సేసినావు
స్వామిని “నట రాజు”గ నీవు నిలిపినావు
ప్రకృతీ మూలముల ఋజువు నీవు!          ||

అంబ! పరమేశ్వరీ! ఆది శక్తీ!
నీ - కాంచన దుకూల చేలాంచములతో
రవి కిరణ సముదాయముల ఆటలు
నీ మణి మేఖల రత్న మణులందున
పౌర్ణమీ చంద్రికల స్థిర వాసము       ||

 (స్వామిని “నట రాజు”గ నిలిపినావు ;

      Link - Konamanini

మంగళవారం 12 అక్టోబర్ 2010


ఆనంద రూపిణీ!

No comments:

Post a Comment