Tuesday, May 10, 2011

"గుళ్ళ సీతా రామ పురము " temple


బొబ్బిలి రాజులు 350 సంవత్సరాల క్రితం కట్టించిన కోవెల అక్కడ ,
కళా వైభవానికి ప్రతిబింబంగా ఉన్నది.
ఆ సీమయే - శ్రీకాకుళం జిల్లాలో,
సంత కవిటి మండలము లో కుగ్రామము "గుళ్ళ సీతా రామ పురము".
వ్యాపార కూడలి , తాండ్ర పాపారాయుని సీమ ఐన
రాజాం పట్టణానికి 9 కిలో మీటర్లు దూరాన ఉన్నది
ఈ Gullaseetharam puram గుడి.
ఈ దేవళములో సీతారామ విగ్రహాలు
కను విందు చేస్తున్నాయి.
భద్రాచలంలో వలెనే
ఇక్కడ కూడా సీతా దేవి అమ్మ వారు,
పతి దేవుని ఒడిలో ఆసీనయై ఉన్నది.
నల్లని గ్రానైట్ రాయి విగ్రహములు అవి.
 ఏక శిలలో ఈ విగ్రహాలను చెక్కిన
శిల్పి ప్రజ్ఞ ప్రశంసార్హమైనది.
ప్రాకార మండపాలు,
Temple sculpture and carvings
నయనానందకరం చేస్తున్నవి

No comments:

Post a Comment