Wednesday, December 14, 2011

ఆకు బంగారంలో "పచ్చ"దనపు మణి






















పత్రమా!
నీ గొప్పదనాన్ని చిత్రించేందుకు
ఆకు పచ్చ వర్ణం- చాలు!
ఐతే,
ప్రకృతి -
తన మేనంతా
పచ్చ దనాన్ని అలుముకున్న తర్వాతే గదూ
ఏ వన్నెకైనా
శ్రీకారం చుట్టుకోబడుతూన్నది!
పూలూ, పైర్లు,
నవ నవలాడే నవ ధాన్యాలు, పళ్ళూ
వానితో అనుసంధానమైన ప్రాణి కోటీ.....
ఇన్నిన్నీ, ఇన్ని రంగులు
సింగారంగా  ప్రతిష్ఠించబడుతూన్నాయి
అంటే- మూలం నీవే సుమీ!

అందుకేనేమో
ఆది దంపతులకు
ప్రీతి ఐనవి బిల్వార్చనాదులు!!!!
గణపతికి నూటొక్క పత్రి పూజలే బహు వేడుక !!!!!!

ఓ ఆకులోని హరితదనమా!
నాడు యుగ సంధి వేళలలో
శ్రీ హరి వైకుఠాన్నీ 
ఆ ఆదిశేషు -  తల్పాన్ని వీడినాడు
ఆ వెనువెంటనే
మర్రి ఆకును పట్టాడు
శ్రీవిష్ణుమూర్తి
వటపత్రశాయిగా ముద్దులొలికాడు
వరహాల ఎత్తుగా నిన్ను గుర్తించాడు,
దైవ అర్చనలో
నిన్ను –
తన అంతర్భాగస్వామినిగా చేకూర్చుకున్నాడు
భళీ!
ఆ భగవంతుని ఈ చమత్కారం!!!!
“పత్రం పుష్పం ఫలం తోయం.....”
తామరాకుల లేఖలు
అభిజ్ఞాన శాకుంతలమ్
కాళిదాసు మహర్నాటక రచనకు
కాంతి రేఖలు ఐనవి

తాళ పత్రములే
ప్రాచీన కాలమ్మునందిన
భారతీయ సాహితిని పదిలపరచీ,
మనకు అందించినాయి

మరి, మామిడాకుల తోరణాలు
గృహ సామ్రాజ్యముల సమీరములతో
చెబుతూనే ఉంటాయి ఈలాగున....
“ఓ మానవుడా! భగవంతుడే గుర్తించినాడు
హరితదనముల పత్ర సంపద గొప్ప విలువలను
పుడమినందున సంతసాలు
నిరంతరమూ పల్లవించాలంటే
పచ్చదనమును సంరక్షించుకొనుటయె
నీదు బాధ్యత, తెలుసుకొనుమా!”

అందుకే ఓ మనుజులారా!
ధరణి తరువుల పసిడి భరిణగ
నిరంతరము ప్రకాశించాలనుచు
ఎల్లరు కోరుకుందాము

ఇలాతలముకు
ఈ సద్భావనా ఆకాంక్షలు
శుభాశీస్సుల తుషార శీకర అక్షింతలు!

&&&&&&&&&&&&&&&&&&&&

       aaku baMgaaraMlO "pachcha"danapu maNi


# patramA!
nI goppadanaanni chitriMchEMduku
aaku pachcha varNaM- chAlu!
aitE,
prakRti pachcha danaanni alumukunna tarvAtE gadU
E vanne kainA
SrIkAraM chuTTukObaDutUnnadi!
pUlU, pairlu,
nava navalADE nava dhaanyaalu, paLLU
vaanitO anusaMdhaanamaina prANi kOTI.....
inninnii, inni raMgulu pratishThiMchabaDutUnnaayi
aMTE- mUlaM nIvE sumI!

aMdukEnEmO
Adi daMpatulaku
prIti ainadi bilvArchanaadulu!!!!
gaNapatiki nUTokka patri pUjala vEDka!!!!!!
aadiSEshu talpaanni vIDi
SrIvishNumUrti
vaTapatraSAyigaa maarADu;
varahAla ettugaa ninnu gurtiMchADu,
daiva archanalO
ninnu – aMtarBAgaswaaminigaa chEkUrchukunnaaDu
BaLI!
aa BagavaMtuni I chamatkaaraM!!!!
“patraM pushpaM phalaM tOyaM.....”
taamaraakulEKalu
SAkuMtala maharnATaka kaaMti rEKalu ainaayi.
mari, maamiDAkula tOraNAlu
gRha saamraajyamula samIramulatO
chebutUnE uMTAyi iilaaguna....
“O maanavuDA! BagavaMtuDE gurtiMchinADu
haritadanamula patra saMpada goppa viluvalanu
puDaminaMduna saMtasaalu
niraMtaramuu pallaviMchaalaMTE
 pachchadanamunu saMrakshiMchukonuTaye
nIdu bAdhyara, telusukonumA!”

aMdukE O manujulArA!
dharaNi taruvula pasiDi BariNaga
niraMtaramu prakASiMchaalanuchu
ellaru kOrukuMdaamu

ilaatalamuku
I sadBAvanaa aakaaMkshalu
SuBASiissula SIkaramulu

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


  కవితా ప్రపంచంలో కవితా పల్లవం,
                   
                      (  కాదంబరి (pen name))


pachcha"danapu maNi ;

"ఆకు బంగరంలో "పచ్చ"దనపు మణి"
;

No comments:

Post a Comment