Tuesday, July 13, 2010

టింగు రంగా! ఓ మేఘమా!


















అంబరాల హుందాగా
తిరుగాడే జల ధరమా!
టింగు రంగా!- నీ గీర;
పట్ట నలవి కాదుగా! ||

ఓలాల! ఓలాల!
ఆ కోప తాపాలు,
అలుకలు, కినుకలూ
ఏలనే చెప్పుమా! ||

మెరుపుల ఊయలలు
పవనుడు ఇచ్చేను
చల్లంగ మెల్లంగ
ఊగుమా నీరదమ! ||

ఆ ఊపు, ఈ ఊపు
ప్రతి ఊపు నిండా
మధురోహలను
నింపు లోకాల నిండా!

కిల కిలా, కల కలా
నీ కళల నవ్వులు
అత్తరుల వానలు
భువి పైరు పచ్చలు ||

***********************
O mEGamaa! ;
____________
aMbaraala huMdaagaa
tirugaaDE jala dharamaa!
TiMgu raMgaa!- nI gIra;
paTTa nalavi kaadugaa! ||

Olaala! OlAla!
A kOpa tApAlu,
alukalu, kinukaluu
ElanE cheppumaa! ||

merupula Uyalalu
pavanuDu ichchEnu
challaMga mellaMga
Ugumaa nIradama! ||

A Upu, I Upu
prati Upu niMDA
madhurOhalanu
niMpu lOkAla niMDA!

kila kilaa, kala kalaa
nI kaLala navvulu
attarula vaanalu
bhuvi pairu pachchalu ||

***********************

gaganaala taaraaDu
hima biMdu Sata kOTi
maNi pUsa vayyaari jala dharama! ||

lIyumaa!
sogasaina haaraala
alli istaamu! ||

nIlaala niMgilO
siMhaasanammiivu;
laala pOyiMchukuni
navvu pasi paapavIvu! ||

No comments:

Post a Comment