Saturday, July 31, 2010

ప్రత్యగాత్మనైనాను ఈ వేళ


















శ్రీ నాధుని తలపు కాంతి సోకగనే
ప్రతి మానవ మానసము
మణిసదనము అగును కదా,
ఔను కదా! ||

హృదయములో భక్తి భావ సాంగత్యం
ఉదయించిన అనుభూతి సౌకుమార్యం
అణువణువున సౌహార్ద్రం పరిపూర్ణం
మణిసదనం, ఔను కదా
ప్రతి మానవ మానసము ||

తృణమైనా పణమైనా ఏక రీతిని
స్వీకరించుటే కదా నీదు ప్రకృతి
మమ్ము మేము మైమరచి - ఓ స్వామి!
“త్వమేవాహమై”నట్టి క్షణములలో
శాంత రస తరంగములకు ప్రభల జాగృతి ||

నిరీక్షణముల ఆవృత్తిగ శ్రీ రమణా!
నిరంతరము సేసెదవు మమ్ము శోధన;
పరీక్షలిటుల సేయ తగదు నీకింక!
అహము వీడి,నిలిచితిని నీ మ్రోల
మహిత - ప్రత్యగాత్మనైనాను ఈ వేళ ||
*********************************
___________________________
SrI naadhuni talapu kaaMti sOkaganE
prati maanava maanasamu
maNisadanamu agunu kadaa, aunu kadaa! ||

hRdayamulO Bakti BAva saaMgatyaM
udayiMchina anuBUti saukumaaryaM
aNuvaNuvuna sauhaardraM paripUrNaM
maNisadanaM, aunu kadaa
prati maanava maanasamu ||

tRNamainaa paNamainaa Eka rItini
svIkariMchuTE kadaa nIdu prakRti
mammu mEmu maimarachi - O svaami!
“tvamEvAhamai”naTTi kshaNamulalO
SAMta rasa taraMgamulaku praBala jaagRti ||

nirIkshaNamula aavRttiga SrI ramaNA!
niraMtaramu sEsedavu mammu SOdhana;
parIkshaliTula sEya tagadu nIkiMka!
ahamu vIDi,nilichitini nI mrOla
mahita - pratyagaatmanainaanu I vELa ||

No comments:

Post a Comment