Friday, April 9, 2010

బుర్రు బురు పిట్ట


************************************************

బుర్రు బురు పిట్ట
తుర్రు తుర్రు పిట్ట
“నీ-ముక్కు సొత్త”అంటే
గుర్రు గుర్రు కోపం.
చర్రు చరున వ్రాలి
గింజ,విత్తులేరి
రివ్వు రివ్వున ఎగిరి
దవ్వు దవ్వులందు
విత్తులన్ని విసర
మొక్క,మ్రానులెదిగె!

చెట్టు చేమ పెరిగి
పచ్చ దనం నవ్వె!

పిన్న,పెద్దలంతా
రండి!రండి!త్వరగా!
దండిగాను నీళ్ళు
పోసి,పెంచుదాము!
హరిత వనం మనకు
గొప్పదైన వరము!
పూలు సౌరభాలు
ప్రకృతి ఆహ్లాదాల్!
తియ తీయని పళ్ళు
మానవాళి భోగం.
కలిసి మెలిసి ఎంచక్కా
అందరమూ తిందాం!


***********************
***********************


రచన: kadambari piduri

No comments:

Post a Comment