Thursday, April 1, 2010

నెయ్యములల్లో నేరేళ్లో ! (annamacharya )















(పల్లవి ) ;;;;;;

నెయ్యములల్లో నేరేళ్లో !
ఒయ్యన ఊరెడి ఉవ్విళ్ళో! నెయ్యము

(చరణము ) :::::
_________

పలచని చెమటల బాహు మూలముల
చెలమలలోనాఁ జెలువములే
తళ తళమను ముత్యపుఁ జెఱఁగు సురటి
దులిపేటి నీళ్ళ తుంపిళ్ళో నెయ్యము

చ (చరణము ) :::::
_________
తొట తొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి బొటి పొటి యలుకల చిరు నగవే
వట ఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో నెయ్యము

( చరణము ) :::::
_________

గర గరికల వేంకటపతి కౌగిట
పరిమళములలో బచ్చనలు
మరుని వింటి కమ్మని అంప విరుల
గురి తాకు లినుప గుగ్గిళ్ళో నెయ్యము

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment