Friday, July 10, 2009

శోభిల్లు మణి దీపములు

నా నుడి పలుకుల వై చిత్రి
నీ మోహన నామపు చాతుర్యం
నీ రూపము వైఖరి చాతురి
గోవిందా! ఇది
నీ కరుణా మహిమల
సౌందర్య పటిమల ఆహ్లాదిని!//

నానుడులు, సామెతలు, గాధలు, గీతులు
కావ్య భరితములు ఎల్ల భాషలు
భాసురమగు నీ ఊసుల రసోద్దీపనములు
మా గళముల శోభిలు మణి దీ్పములు! //

క్రిందు మీదు మీమాంసలు, వాదులు
ఎగుడు దిగుడు తర్కముల పోరులు
ఇబ్బడి ముబ్బడి వద్దే వద్దు!
ఒబ్బిడి శ్రీ పతి నామము చాలును //

గో్విందు భజనలే రసవిందు!
అందు బాటులో అందరికీ
స్వామి చరితము మననము నందున
ఘడియ లన్నియును సుధా పూర్ణములు //

**************************************

No comments:

Post a Comment