Wednesday, June 17, 2009

తొండైమాను చక్రవర్తి ; "ఆనంద నిలయము"



మీకు ఆకాశరాజు ఎవరో తెలుసా ?శ్రీ వేంకటేశుని పత్ని "పద్మావతి"కి కన్న తండ్రి అయినట్టి ఆకాశ రాజు .
శ్రీ పద్మావతీ దేవికి చిన్నాయన అనగా ఆకాశ రాజుకు తమ్ముడైన రాజు "తొండై మానుడు".
ఇతడే తొండమాన్ చక్రవర్తి అనే పేరుతో కూడా అన్నమయ్య కృతులలో వినుతి కెక్కాడు
*************************************************

ద్వాపర యుగం తర్వాత కలియుగారంభం అవసాగినది.
మహా భారత యుద్ధం అనంతరం
"మానవ జాతి సమాజము పునర్నిర్మాణము" మరల కొనసాగినది.
విక్రమార్కుడు మున్నగు ప్రభువుల తర్వాత చంద్ర వంశములో జన్మించిన," సుధర్ముడు"
పూర్వ జన్మలో గొప్ప పుణ్యము చేసుకొనెను.
సుధర్మునికి ఆకాశ రాజు, తొండమానుడు అనే సుపుత్రులు ప్రభవించారు.
శ్రీ వేంకటేశునికి తన కుమార్తె పద్మావతీ దేవిని ఇచ్చి ,పెళ్ళి చేసిన పుణ్యచరితుడు
ఆకాశ రాజు.
పద్మావతీ పిన తండ్రి ఐన తొండైమానుడు చారిత్రక ప్రసిద్ధి కల వ్యక్తి.
శ్రీ తిరుమలేశునికి ఇతను "ఆనంద నిలయము"ను కట్టించెను.
"కపిల తీర్ధము"అనే పెద్ద చెరువును త్రవ్వించెను.
ఈ చెరువు జలములతోటే ఇదివరకు స్వామి వారికి అభిషేకములు నిర్వహించే వారు.
కపిల తీర్ధమే "తామర గుంట"గా ప్రసిద్ధి కెక్కెను.
తొండమానుడు శాతవాహనుల సైనిక దళాధిపతి. వీరాగ్రేసరుడు, గొప్ప విజేత.
ఈయనే నారాయణ వనమునకు పాలకుడు.
శైవ భక్తుడైన తొండైమాను చక్రవర్తి పరిపాలించిన సీమకు
"తోండ మండలము" అని పేరు కలిగెను.
ఈతని రాజధాని "కోట". తొండమానుని రాజధాని ఐన కోట శ్రీ కాళ హస్తికి 8కి.మీ. దూరములో ఉన్నది.
ఈ గ్రామమే ఇప్పుడు "తొండమనాడు"గా పేరు గాంచినది.
(టూరిస్టు డిపార్టుమెంటు ఈ సీమను కూడా అభివృద్ధి చేసి,
ప్రజలకు చారిత్రక అవగాహన కల్పించ వలసిన అక్కర ఉన్నది)

*************************************************************

చింతచెట్టు వింజామరగావెలసినవాడు అని ఏడుకొండలవాడినిఅభివర్ణిస్తారు.
కొండ కుంగినట్లుగా నిలచినదేవుడు (మలై కునియ నివు పెరుమాళ్‌)అనీ అంటారు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


శ్రీవేంకటేశ్వరుడు నిలిచినస్థానం తిరుమలకొండకు నాభి వలె ఉంటుంది.
చుట్టూ ఎత్తయిన కొండలు హరితపుష్పపురేకల వలె ఉంటాయి.
అర్చావతారంగా వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహంపై
తొలినాళ్ళలోసూర్యచంద్రులు ప్రకాశించేవారు.
వైష్ణవఆలయాలలో శ్రీవేంకటేశ్వరుడు తొలి ఏకధృవమూర్తి.
ఇతర దేవతలులేకుండా ప్రధాన దైవం మాత్రమేఉండడాన్ని" ఏకధృవమూర్తి అంటారు".

తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడు వెలసినతర్వాతే
హిందూ శిల్ప, ఆగమ శాస్త్రాలురూపొందాయని అంటారు.
ఏకధృవమూర్తిగా వెలసినశ్రీవేంకటేశ్వరునికి తొలినాళ్ళలో ఆకాశమే పైకప్పు.
వైకుంఠం నుంచి శ్రీవేంకటేశ్వరుడు దివ్యవిమానంలో అవతరించారని
ఆ విమానం మానవులకుకన్పించదని
భక్తులకు కన్పించేవిధంగాతొండమానుడు విమానాన్ని నిర్మించాడని
పురాణాలు చెబుతున్నాయి.

గోపురాన్ని లేదా గర్భగృహంపై గల ఎత్తైన నిర్మాణాన్ని" విమానం" అంటారు.
తిరుమల గర్భ గృహంపైగల విమానాన్ని "ఆనందనిలయం " అంటారు.

అసలుసిసలైన మేలిమి బంగారపు రేకులతోధగధగలాడే
ఆనందనిలయం లక్ష్మీపతిభక్తులకు పరమానందం కలిగిస్తుంది.
పురావస్తు ప్రమాణాల ప్రకారం
క్రీ.శ. 12వశతాబ్ది ప్రాంతంలో ఆనందనిలయాన్ని నిర్మించారు.
విజయనగరరాజు వీరనరసింగదేవుడుతన ఎత్తు బంగారాన్ని ఆలయానికి ఇచ్చారు.

ఆబంగారంతో తొలిసారిగా ఆనందనిలయానికి పూత వేయించారు.
నరసింగదేవుడు 1262 వరకు రాజ్యపాలనచేశారు.
1251 నుంచి 1275 వరకు పరిపాలించినపాండ్యరాజు "జాతవర్మసుందరపాండ్యన్"
‌ విమానంపైబంగారు కలశాలను ఏర్పరచారు.

కుమార కంపనవడయార్‌కు సేనాని అయిన సాళువమంగిదేవుడు
1359లో మరోసారి బంగారు తాపడంచేయించారు.
2వ దేవరాయలు కొలువులోమంత్రి అయిన

మల్లన్న 1444 ప్రాంతంలోఆనందనిలయానికి మరమ్మతుచేయించారు.
9-9-1518న బహుధాన్యసంవత్సరంలో
త్రిసముద్రాధీశుడు శ్రీకృష్ణదేవరాయలువిమానాన్ని మెరుగుపరచి
బంగారు తాపడంచేయించారు.

కంచికి చెందిన కోటికన్యకాదానం తాతాచార్యులు 1630లో బంగారు పూతపూయించారు.
1908లో మహంత్‌ ప్రయాగదాస్‌బంగారు కలశాలను మరోసారి ఏర్పరచారు.
1958లోతిరుమల తిరుపతి దేవస్థానం ఆనందనిలయాన్నిపూర్తిగా పునర్నిర్మాణం చేసింది.
అప్పట్లో 12లక్షల రూపాయల విలువ చేసే 12వేలతులాల బంగారం వినియోగించి
18 లక్షల రూపాయలఖర్చుతో 5 ఏళ్ళలో నిర్మాణం పూర్తి చేశారు.
27 అడుగుల4 అంగుళాల భుజపు కొలత 37 అడుగుల 8 అంగుళాలఎత్తుగల చతురస్రాకారపు
"ఆనందనిలయానికి " 3అంతస్తులు.
మూల విగ్రహాన్ని దర్శించుకున్నప్పటికితనివి తీరని భక్తులు
ఆరాధనగా చూసే విమానవేంకటేశ్వరుడు ఆనందనిలయపు 2వఅంతస్తులో ఉంటారు.
*************************************************
తింత్రిణీ మూల సంభవుడు ,అనగా చింత చెట్టు వింజామరగా కలిగి ,
తరు మూలము నివాసముగా కల వాడు అని అర్ధము.

No comments:

Post a Comment