Wednesday, June 17, 2009

ఆషా మాషీ గా......



ఆషా మాషీ గా...... ==========
1)"ఇక్కడ స్పీడు బ్రేకర్లను వేసే అవసరం లేదు.తారు వేస్టు ఔతుంది."

"ఏం?ఎందుకనీ?"డాంబరును' సేవు' చేస్తూన్న

ఆ రోడ్డు కాంట్రాక్టరును ప్రశ్నించారు,తక్కిన వాళ్ళు.

"ఇటు వేపు చూసి చెప్పండీ!మీకు ఏమి కనపడ్తూంది?"

"మరే! ఉమెన్స్ కాలేజీ ఉన్నదండీ!!"

గొప్ప చిదంబర రహస్యము వాళకి అర్ధమై పోయింది,కాంట్రాక్టరు చెప్ప నక్కర లేకుండానే! &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
2)"మా ఇంట్లో అందరూ స్టార్‌లే!!"

"ఎట్టెట్టా!!అది ఎట్లాగ?" దోస్తు విస్మయ చకిత ప్రశ్నార్ధకము అది.

"ఔనురా! మా తాత స్టేషను మా'స్టారు ':

మా నాన్నేమో స్కూలు మాస్టారు :

మా అమ్మ సంగీతం మాస్టారు :

మా చిన్నాయన ఉద్యోగం ఇన్ "కాదంబినీ త్రీ స్టారు 'హోటలులో!!"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


3)వడుగు,కాశీ యాత్ర వేడుకలతో పెళ్ళి వారింటి ముంగిట,

పందిట్లో సందడిగా ఉన్నది.

"పెళ్ళి కొడుకు కోసం 'పాంకోళ్ళూ 'తీసుకు రండి."

{పావు కోళ్ళు = చెక్క చెప్పులు ,వడుగు వేడుకలలో సాంప్రదాయము ప్రకారము వాడెదరు.

"జులపాల స్టూడెంటు వెంఠనే పరుగెత్తి,వెళ్ళి,తీసుకొచ్చాడు,కోడి పుంజునూ,టర్కీ కోడినీ!!!!
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
4)"పురోహితుణ్ణి అడిగారు,కొత్తగా కాలేజీలో జాయిను ఐన విద్యార్ధులు.

"పంతులు గారూ!మీ మంత్రాలను కాస్తంత గట్టిగా,స్పష్టంగా చదవండి.

ఈ కాసెట్టులో రికార్దు చేసుకుంటాము."

"మీకు ఇంత శ్రద్ధ,జిజ్ఞాసలు కలిగినందుకు,చాలా సంతోషం."

మన సంస్కృతి పట్ల గొప్ప ప్రేమను,ఆసక్తినీ వెలిబుచ్చుతూన్న వారిని చూసి,

ఆనందముతో,ఉబ్బి తబ్బిబ్బు ఔతూ అన్నాడు,పాపం!ఆ పిచ్చిబ్రాహ్మడు.

"మరే!మా లెక్చరర్లకు కొత్త నిక్‌నేములు పెట్టాలి;

మీ శ్లోకాలలో నుండి,సెలెక్టు చేసుకుందామని,

అనుకుంటూ ఉన్నాము,మాస్టారూ!"

బహుళ మేధావి కుర్రాడొకడు అసలు రహస్యమును బయట పెట్టాడు.


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&




No comments:

Post a Comment