Monday, June 1, 2009

కబీరు దాసు సూక్తి రత్నావళి

"తారక మంత్రము కోరిన దొరికెను :ధన్యుడ నైతిని ఓరన్నా!"అనే ప్రజలకు చిర పరిచితమై,జన రంజకమైన ఈ పాట(ధన్యాసి రాగము)రామ దాసు విరచితము.ఈ తారక మంత్ర ఉపదేశమును పొందగనే,కంచర్ల గోపన్న
శ్రీ రామ చంద్రుని భక్తాగ్రేసరునిగా మారి,"శ్రీ రామ దాసు"గా
ఆచంద్ర తారార్కము చిర కీర్తినార్జించాడు.ఎన్నో ఇడుముల పాలైనప్పటికీ, భద్రాచలముపైన "శ్రీ రాముల వారి"దేవళమును నిర్మించగలిగిన ధన్య జీవి ఐనాడు.ఇంత గొప్ప చారిత్రక సంఘటనకు ఇరవైనది ఆ గురు శిష్యుల సంగమమే!ఆ శిష్యుడు 'రామ దాసు'ఐతే, ఆ గురువు"భక్త కబీరు దాసు".
నేత పని వృత్తిగా గల దంపతులకు అనాధ బిడ్డ దొరకగా,"కబీరు"అని పేరు
పెట్టుకుని,ప్రేమతో పెంచుకున్నారు.
"కబీరా చే మాగీం ; మూల ఉర విలే కుంభారాచే." "కబీరు చేత శ్రీ పాండు రంగ విఠలుడు,నేతను నేయించెను;కుమ్మరి వాని పిల్ల వాణ్ణి బతికించెను,"అన్నాడు కబీరు దాసు.;;;;;"పాండు రంగడు వెలసిన(మహారాష్ట్రలోని )పండరి పురము ఎందరో భక్త శిఖామణులను అక్కున చేర్చుకుని,భక్తి సాహిత్యము శాఖోప శాఖలుగా విస్తరిల్లిన పుణ్య క్షేత్రముపరమ భక్తాగ్ర గణ్యుడైన కబీరు మాట్లాడిన మాటలు సుధా సమములై,భక్తి సరస్సునందు తొణికిసలాడినవి.;;;"మాలా ఫేరత్్ జుగ్్ భయా ;ఫిరానమన్'కా ఫేర్;; కర్్ కా మన్్ కా డరేరికే!""ఎన్గాఏళ్ళుగా, యుగములుగా (ఫేర్)మాలను ధరించి,తిప్పుతున్నా,ప్రయోజనం లేదు,చేతిలోని తావళమును వదిలి వేసి,మనస్సునే మాలగా ఒనర్చిసాధన చేస్తే పరమాత్మునికి చేరువ ఔతావు.";;;
కొన్ని కబీరు నుడువులు "ఔరా!"అనిపిస్తాయి.(1)హృదయమునందు విశ్వాసము వలె; మెలకువలోనూ,నిద్దురలోనూ అతడే కలడుఏ వ్యక్తి ఆ స్వామిని తలచు చుండునో,వాని వద్దనే,ఆ స్వామి ఉండును."(2):ఖర్జూరం్ చెట్టు వలే,పొడవుగా పెరిగిన ఫలమేమున్నది?,బాటసారులకు నీడను ఈయదు,ఫలములు అందవు."(3)వాడు ఒకటి తిట్టును,బదులు తిట్టకు.ఆ తిట్టు ఒక్కటే మిగులును."ఇలాగేదోహా>>>"ఆవత్్ గారీ ఏక్్ హై;ఉల్టత్్ హోయ్్ అనేక్;; కహ కబీర్్ నహీ,ఉలటియే వహ్్ ఏక్్ కీ ఏక్."ఎవరైనా ఒక దెబ్బ కొడితే,నీవు సహింపకున్నచో,ఆ దెబ్బ అనేక దెబ్బలకు దారి తీయును.సహించి మిన్నకున్నచో,ఆ దెబ్బ ఒకటిగానే మిగిలి పోవును,పగ,ప్రతీకారములు అంతటితో సమసి పోవును..
సూక్తి>>>

(4)గ్రాసము లేని కొలువు.ఇంగిత జ్ఞానము లేని తనువు.(5')హృదయము'అనే త్రాసు నందు,'మంచితనము'ను తుల తూచుము.(6)నీటిని కోసినచో రెండుగా చీలదు.(7)చెత్తలో రత్నము ఉనది;కసువులో ముత్యము ఉన్నది,ఏరుకొనుము,మిత్రమా!(8)త్రవ్వుట చేత భూమీ,నరుకుట చేత చెట్లూ,దెబ్బల వలన ఇనుమూ,అట్లే ఇతరులు వేసిన నిందలూ,కువచనముల్లు,సాధువును 'ఓరిమి'కి ప్రతిరూపములుగా నిలుపుచూ,లోకమునకు ఉపకారమునే కలిగించుచునే ఉన్నవి.
నిష్కారణముగా పరులను దూషించుటయే వ్యాపకముగా చేసుకున వారి గురించి కబీరు తెలిపెను.(1)మామిడి కొమ్మలలోని కోయిల తీయనైన రాగముతో "కుహు!కుహూ!అన్నది.తటాకములోను,చెరువులలోను కప్పలు బెక బెకమన్నవి.కోకిల తన కూతను ఆపినది,అంతే!మండూకములు'గెలుపు తమదే!'అని తలచినవి.(2)అంధుని ఎదుట నాట్యము,చెవిటి వాని వద్ద శంఖారావము,వృధా!"అంటూ కబీరు దుర్జనుల ఎదుట సాధువుల ప్రవచనముల స్థితి కూడా అంతే!(3)కడలికి తరంగాలు,మనసుకు పరుగులూ సహజము.;;;;;సాధువుల వోలె,భక్తులకు మల్లే నటించే మిధ్యా తవాన్ని గూర్చివాక్కులు ఇవి,(1)జపమాల త్రిప్పినంత నే సాధువుఅగునా?అలాగైతే బావిపైని గిలక,సున్నము గాడిలోని గానుగలు
కూడా సాధువులే!(2)"సద్గురు సవాన్్ కో సగా ;సోధి సయీ న దాతి ;హరి జన్" సయీ న జాత్."{ఈ దోహా లోని"హరి జన"అనే పదమే మహాత్మా గాంధీజీకి స్ఫూర్తి దాయకము.} సద్గురువుతో సమానమైన ఆత్మ బంధువు,తత్వ శోధకుని మించిన దాత,శ్రీ హరిని మించిన హితుడు,హరి భక్తులను మించిన'జాతి వారు' లేరు.
(3)కస్తూరి మృగము తన నుండి వచ్చే సువాసనలను తెలుసుకో లేక,కాననములోని పచ్చికలో అన్వేషిస్తూ,పరుగులు తీస్తూ ఉంటున్నది;పూవులోని పరిమళము వలే,తనలోనే ఇమిడి ఉన్న దైవమును జమనిషి కనుగొనలేడు.దోహా>>"తేరా సాయీ తుఝ్్ మే; జ్యో ప్యుహపన్్ బాన్; కస్తూరి కా'మిరగ్'జ్యో;;ఫిరి ఫిరి ఢూంఢే ఘాస్." ఇట్టి అనేక సూక్తులు,కబీరు దాసు మనకు అందించిన మణి మాణిక్యములే!

No comments:

Post a Comment