Sunday, May 1, 2011

కలువ పూలతో పూజలు



హంస వాహిని! బ్రహ్మ అర్ధాంగీ!
శ్రీ శారదాంబా! విద్యలకు జననీ!
నీకు శత కోటి నుతుల;
కుముదార్చనలివే! అమ్మ! గైకొనుమా!    ||శత కోటి నుతుల||

నీ వీణ రాగాలు ఒలికించగా;
సంగీత స్వర గాథలింపొందగా;
మనుజులకు ఒసగిన మహనీయవు!
నీకు శత కోటి నుతుల;
కుముదార్చనలివే! అమ్మ! గైకొనుమా!     ||శత కోటి నుతుల||

సిరి గానమొలికించు శుభదాయినీ! ;
లిపి నీకు నవ రత్న సింహాసనం ;
సురుచిర రూపిణీ! శుభ దాయినీ! ||శత కోటి నుతుల||

నిను తలచి, నిత్యము ;కొలిచేటి భక్తులము;
స-రి-గ-మ- ల :లాలించుమా!
మము ప-ద-ని-స- ల ; పాలించుమా! ||శత కోటి నుతుల||

No comments:

Post a Comment