ఏడు కొండల స్వామి, నీ
తోడు దొరికెను భాగ్యము
వేడుకాయెను నీదు సన్నిధి
రత్నాల మేడలులే! ||
ఆలవాలము నీదు కన్నుల
పూల చూపుల చాందినీలకు
చాల సోపానములు దరిసి
నీ , మ్రోల చేరెదము ||
జాలములు ఆదిత్య కిరణముల్
సాల భంజికలుగ వెలిసెను
మేలిమౌ శ్రీ స్వామి భక్తిని
ఓలలాడెదము | ||
కోరి కొలిచిన వారి పెన్నిధి
కొంగు బంగారమ్ము అతనే!
వేరు భక్తుల కల్ప తరువుకు ;
వేరె ధ్యాసలు మాకికేల?
మా కంటి తారలు స్వామియే! |
&&&&&&&&&&&&&&&&
EDu koMDala swaami nI
tODu dorikenu BAgyamu
vEDukaayenu nIdu sannidhi
ratnaala mEDalulE! ||
aalavaalamu nIdu kannula
pUla chUpula chaaMdinIlaku
chaala sOpaanamulu darisi
nI , mrOla chEredamu ||
jaalamulu aaditya kiraNamul
saala BaMjikaluga velisenu
mElimau SrI svaami Baktini
OlalaaDedamu | ||
kOri kolichina vaari pennidhi
koMgu baMgaarammu atanE!
vEru Baktula kalpa taruvuku ;
vEre dhyaasalu maakikEla?
maa kaMTi taaralu svaamiyE! ||
No comments:
Post a Comment