Saturday, January 8, 2011

పద్మావతికి పారిజాతము పూలు


పారిజాతము మాల కూర్చి తెచ్చాను;
వారిజాక్షీ! శ్రీ దేవి నీకై ||

పారిజాతము కల్ప తరువును ;
జోరుగా దివి నుండి తెచ్చిన,
స్వామి; వారికి ప్రియ సుమమ్ములు
కోరి నీ జడను తురిమెను ;
నీరజాక్షీ! అలమేలు మంగమ! ||






సారె సారెకు చిరు, అలక కినుకలు ;
దూరమాయెన? శ్రీ కోవెల
నారి బడలిక తెలిసి నాథుడు
ఆరొక్క కొండలును శీఘ్రమే ;
దిగి వచ్చినాడు, ఇంతిరో!పద్మావతీ సతి! ||














No comments:

Post a Comment