గాలికి మోదం కూర్చును పూవులు ;పువ్వుల నేస్తం చేయగనే ;సుగంధమ్ముల గనిగా ఆయెను గాలి.పువ్వులతోటి స్నేహ హస్తమును ;అందుకున్నదీ చిరు గాలి ;ఐనది గాలి ఆ వెనువెంటనె ;సౌగంధమ్ముల మ(క)రంద పెన్నిధి!మలయ పవనములు సాగీ, సాగీ, పయనాలు;పైరుల, తరువుల పలకరింపులు ;ప్రజలందరికీ ప్రకృతి జననీ – అర్చనఎపుడూ ఆమోదం, అది ఆహ్లాదకరం.ప్రకృతిలోని ప్రాణి కోటితో ;జతలు కూడిన సమ తౌల్యతపై ;ఆప్యాయతలు, అవగాహనలు,సదా ఉండ వలె సజ్జనులారా!"అనుచు, బుజ్జగించుచూ,నుడివెను ఉదయం.
No comments:
Post a Comment