Tuesday, January 11, 2011

పారిజాత రాశిగా తిరు గిరులు

సరి కొత్త కళలు అలదుకొనును ప్రతి ఉదయం
నీ చల్లని చూపుల సుధా వృష్టి వలననే!
పద్మ లోచనీ! పరమానంద దాయినీ!
తిరుచానూరున వెలసిన పద్మావతి!
మా జననీ! ||పద్మ లోచనీ!||

అదె తిరుమల! ఏడు గిరులు ;
సదమల మృదు సౌరభముల/లు ;
ముదముగా అందించును భక్త కోటికి
ముదిత! ఏమి నేపథ్యము? ||పద్మ లోచనీ!||

తిరుచనూరు నుండి; తల్లి! ;
నీ చూపుల విరి తావులు;
పారిజాత సుమ రాశిగ
తిరు గిరులను చేసేను ||పద్మ లోచనీ!||

No comments:

Post a Comment