Monday, January 10, 2011

హాయిగ పలుకవె ఓ చిలుకా!















తీయని పలుకులు ఓ చిలుకా! ;
చక్కెర పలుకులు తొణికిస్తూ ;
హాయిగ పలుకవె ఓ చిలుకా!
బంగరు కొండవు నీవమ్మా! ||

కోయిలమ్మలను ఆహ్వానించి ;
నీతో నేస్తం చేయిస్తాం!
పచ్చని ఆకుల డోలల పైన ;
చక్కగ వాలి నువ్వు ఆడితే వాలితె,
హరిత భరితమై
వనములు ,తోటలు
కళ కళ లాడును ||

అడవిని సీతా రామ చంద్రుల ;
ఆయాసమును మరిపించమ్మా! ;
అందుకె నిన్ను బాల ప్రపంచం :
“రామ చిలుక”వని కీర్తించు ||

++++++++++++++++++++++












tIyani palukulu O chilukaa! ;
hAyiga palukave O chilukaa! ||
chakkera palukulu toNikistU ||

kOyilammalanu aahvaaniMchi ;
nItO nEstaM chEyistaaM!
pachchani aakula pai
chakkaga vaali nuvvu ADitE
harita bharitamai
vanamulu, tOTalu;
kaLa kaLa lADunu ||

aDavini sItaa raama chaMdrula
aayaasamunu maripiMchammaa! ;
aMduke nIku baala prapaMchaM :
“raama chiluka”vani kIrtiMchu ||

No comments:

Post a Comment