Sunday, January 9, 2011

చల్లని దీవెనల స్వామికి కోటి దండాలు ;
























ఏలేలో! ఏలేలో! ఏలేయాలో! ;
తిరుమల గిరి కొంగుల ఉన్నదదే బంగారం! ;
కరుణా రస నిలయుడు శ్రీ వేంకటేశుడేనమ్మా! ||

మల్ల గుల్లములేల? ;
తల్లడ పాటులు వలదు;
ఎల్లరికీ సుఖము నిచ్చు చల్లని దీవెనల స్వామి!
వేంకటేశ! దండాలు!దండాలు! శత కోటీదండాలు! ||

పూవు దండలూ, మణులు;
నవ రత్న ఖచిత హారములు ;
తుల తూచే హంగులు, ఆర్భాటాలు ;
సమమౌనా స్వామి పెదవి చిరు నవ్వుకు ||

కొండ కోనలలొ మెట్లు;
ఏడు కొండలా పైన అదె కోవెల కన రండీ! ;
స్వామి రూపు నింపుకున్న ;
ప్రతి హృదయము గుడియేలే ||


ఏలేలో! ఏలేలో! ఏలేయాలో! ;
తిరుమల గిరి కొంగుల ఉన్నదదే బంగారం!
కరుణా రస నిలయుడు శ్రీ వేంకటేశుడేనమ్మా! ||

===========================/////


















ElElO! ElElO! ElEyaalO! ;
tirumala giri koMgula unnadadE baMgaaraM! ;
karuNA rasa nilayuDu SrI vEMkaTESuDEnammaa! ||

malla gullamulEla? ;
tallaDa pATulu valadu;
ellarikIsuKamu nichchu;
challani dIvenala svaami!
vEMkaTESa! daMDAlu!Sata kOTI daMDAlu ||

pUvu daMDaluu, maNulu;
nava ratna Kachita haaramulu ;
tula tUchE haMgulu, aarBATAlu ;
samamaunaa svaami pedavi chiru navvuku ||

koMDa kOnalalo meTlu;
EDu koMDalaa paina ade kOvela kana raMDI! ;
svaami rUpu niMpukunna ;
prati hRdayamu guDiyElE ||

ElElO! ElElO! ElEyaalO! ;
tirumala giri koMgula unnadadE baMgaaraM! ;
karuNA rasa nilayuDu SrI vEMkaTESuDEnammaa! ||

No comments:

Post a Comment