
నవనీత చోరా! నిన్ను గనిఅవనిని అన్నిటి తత్వము మారెను,ఏమని నుడువుదు?. ||నీల మోహనము, నిత్య దివ్యము;లాలనగా – నీ రూపము దోచీ ;జలతారు ఱెప్పల దాచ్చుకున్న,నా - లీలాల కన్నులు, తులిపి చోరులు ||సుడి వడి - రాగ సుధా రస వాహినులతడుముకోక, తడబాటులు లేకఒడిసి పట్టినవి శ్రవణేంద్రియమ్ములుగడుసు చోరులు వీనుల జంట ||
No comments:
Post a Comment