Monday, April 20, 2009

దవన పున్నమ



         "శ్రీ కాకుళ ఆంధ్ర మహా విష్ణు మూర్తి" కొలువై ఉన్న పుణ్య క్షేత్రము "శ్రీ కాకుళము".
 ఈ క్షేత్రము కృష్ణా జిల్లాలోని దివి సీమ లో ఉన్నది.
 శ్రీ కాకుళాంధ్ర మహా విష్ణువు " తెలుగు రాయని" గా ప్రసిధ్ధికెక్కెను.
 వసంత నవ రాత్రులలోనూ, పూర్ణిమ నాడు
 "ఆంధ్ర మధు మదనుడు" గానూ, "తెలుగు రాయని" గానూ
 ఖ్యాతి గాంచిన "ఆంధ్ర మహా విష్ణువు"నకు అనేక అర్చనలు జరుగుతూ ఉంటాయి.
 వానిలో "దమళినీ దళ పూజ" ముఖ్యమైనది. 

         "పద్మ సంహిత" లో "దవన పున్నమ" వివరణ
"వసంత కాల తృప్త్యర్ధం తత్సమృధ్ధిభి రాహృతైః 
పుష్పైర్ నానా విధైః దేవ మర్చయే దక్షిణా ముఖం 
ఆసీనం మణ్డపే క్లుప్తే వేదీ మధ్యే మనోరమే 
ఉద్యానే మందిరే వాపి కృత్రిమోద్యానన శోభితే 
నద్యాదౌ వా యథా యోగం ఫల పుష్పోదకా న్వితే. " 

"పౌర్ణమాస్యాం తిధౌ తస్మిన్ మాసే దమనికా దళైః 
పుష్పాన్వితైఃప్రపాంకృత్వా మణ్దపే పూజయేధ్ధరిం 
పుష్పైః దమనికాభి శ్చ సర్వాలంకార మాచరయేత్ 
ఉత్సవశ్చ భవేత్తస్మిన్ హోమా దమనికా దళైః 

వైశాఖి మాసి వా కుర్యా ద్వసంతోత్సవ మబ్జజ 
దమనీ దళ కల్యాణ మపి వా పూర్వ మీరితం 
వైశాఖే మాసి వా చైత్రే సిత పక్షే శుభే దినే 
దమనీ దళవ త్కుర్యాత్ కళార కుసుమోత్సవం."
         అక్క మహా దేవి శాసనము వలన 
            మనకు తెలియు చున్న చారిత్రక విశేషము. 

         దాక్షారామము లో కొలువైన శ్రీ భీమేశ్వర స్వామికి కూడ 
         "దమళినీ పూజ" అర్చనా విధానములలో 
                                     అనుసరించబడుచున్నది .


'''''''''

No comments:

Post a Comment