
గోకుల వని ;;;
''''''''
ఆడెను కృష్ణుడు "గోకుల వని"లో;
ఆడెను కృష్ణుడు నాట్య మాడెను //
కౌస్తుభ రాణ్మణి తళుకు లీనగా;
కేయూరములు బెళుకు లొత్తగా;
అంగుళీయకము మిలమిల లాడగా//
కంకణ నిక్వాణముల తూగగా;
శృంఖలములు చిందులు వేయగా;
మంజీరములు తాళము లేయగ//
పింఛకాంతులు నింగి కెగయగా;
కంకణ రజములు సుద్దు లాడగా;
ముత్తెపు నఖములు ముద్దు లాడగా;//
మ్రోగెను వేణువు బృందావనిలో;
మురళీ గాన వీచికలలో ;
సాగెను యమునా వాహిని ;
మెల్ల మెల్లగా ;
మృదు మోహనముగా //
''''''
No comments:
Post a Comment