Showing posts with label వ్యాస కదంబ మాల. Show all posts
Showing posts with label వ్యాస కదంబ మాల. Show all posts

Tuesday, July 11, 2017

కుంతీ పుత్రో వినాయకః

కుంతీ పుత్రో వినాయకః ;-
 గత దశాబ్దం వఱకు "కాపీ కొట్టుట" అనే మాట తఱచూ చర్చించబడేది. 
"గ్రంధ చౌర్యము" అనే అంశము వలన వాదోప వాదాలు జరుగుతూండేవి. 
రచన, సాహిత్య వర్గాలలో ఈ విషయమై ఇలాగ "గ్రంధ చౌర్యము, కాపీ కొట్టడము" లాంటి పదాలు 
వాడుకలో ఉన్నాయి. 
ఐతే సంగీత, నాట్యాది ఇతర కళలలో కూడా కాపీ సాధారణమే ఐనప్పటికీ, 
అచ్చట ఇలాంటి ప్రత్యేక పదమేదీ వాడుకలో ఉన్నట్టు కనుపట్టదు. 

***        ***        ***        

         ప్రాచీన లాక్షణికులు 
         "నాస్తి చోరః కవి జనాః" అనేశారు. 

         "చౌర్యం" అనే మాట సారస్వత వర్గాలలోనే మరింత ప్రాచుర్యములో ఉండటానికి కారణమేమిటి? 
సమాజంలో అభిప్రాయాలను రూపొందించడము, రచనల ద్వారా సత్వరమే సాధ్య పడుతూన్నది. 
కలం బలంతో, ప్రభుత్వాలనే మార్చిన సంఘటనలు ప్రపంచ చరిత్రలో ఉంటూన్నాయి కాబట్టి, ఇతర కళల కన్నా "కలం బలమే మిన్న, అతి శక్తి మంతము" అని తోస్తూన్నది. ఈ కాపీ కొట్టడమనేది సినిమాలలో సుస్పష్టంగా గోచరిస్తూంటున్నది. 

         సినీ ప్రపంచము సర్వ కళా సమన్వయ వేదిక! కాబట్టే, అక్కడ కథ, సంభాషణలు, సంగీతము, డాన్సు, కెమేరా ఇలా ఒకటేమిటి, దాదాపు అన్ని కోణాలలోనూ కాస్తో కూస్తో కొండొకచో దాదాపు అంతా "కాపీ" వ్యవహారం విస్పష్టంగానే ఉంటుంది. అత్యంత ఖరీదైనది కాబట్టి ఇది రమా రమిగా ఆమోదించ బడ్తూన్నది కూడా! 

         "దేవ దాసు" వంటి (శరత్ చంద్ర ఛటర్జీ )నవలలు కొద్ది కొద్ది మార్పులతో, అనేక పర్యాయాలు వెండితెరకు ఎక్కి విజయ భేరీని మ్రోగించినాయి కదా! 

***        ***        ***        

         ఐతే "రచనలు, కళలు ఎంత మేఱకు కాపీ చేయ వచ్చును?" అని అభిజ్ఞుల ప్రశ్నయే ఇప్పుడు వ్యాసానికి ప్రాతి పదిక. "కాపీ కొట్టడమే తప్పు" ఇది నిర్వివాదాంశమే! తమాషా ఏమిటంటే, కొన్ని సార్లు మూల రచయిత/కళా సృజన కర్తలకు ఈ పరిణామం అతి విచిత్రంగా, మూల కర్తలకు "భక్తితో ఒసగే హారతి" గా పరిఢవిల్లుతూన్నది. 
"అబద్ధం వా    సుబద్ధం వా     కుంతీ పుత్రో వినాయకః||"
         "అనుకరణ" ను, కాపీ చేయడాన్ని ఆమోదించినప్పటికీ, మూల కర్తలకు "కృతజ్ఞతలను" ప్రకటించాలి. అది వారి సంస్కారానికి నిదర్శనమే కదా! 
;;
AF - ఇతిహాస దరహాస చాటువులు Essay ;  LINK ;
My File - Documents - 2010 KONamAnini ;;;;;;;;;;;;

Sunday, May 18, 2014

నెహ్రూజీ, నీలం పుస్తకము


ఇండియా తొట్ట తొలి ప్రధాన మంత్రి. బాలలకు ఈయన “చాచా నెహ్రూ”. శాంతిపావురములను ఎగురవేసే  అలవాటు జవహర్ లాల్ నెహ్రూ ద్వారా వ్యాప్తి చెందింది. ఒక సాధారణ వ్యక్తికి జవహర్ లాల్ నెహ్రూ తటస్థపడినప్పుడు జరిగిన సంఘటన ఇది.

మహాన్ సింఘ్ బయస్ ఒక జూనియర్ పోలీసాఫీసర్. 1958 లలో అతను సెక్యూరిటీ డ్యూటీ చెయ్యాల్సివచ్చింది. బోంబే (నేటి ముంబై) దగ్గర తాన్సా అనే ఊళ్ళో భద్రతా విధుల పని పడింది. అక్కడికి వస్తూన్న వ్యక్తి సాక్షాత్తూ దేశ ప్రధాన మంత్రి. ప్రారంభోత్సవ వేడుక ఐపోయింది. నెహ్రూ వేదిక నుండి కిందకు దిగాడు. వెదురు కర్రలతో కట్టిన బారికేడులను దాటి వచ్చారు. ఆయనను కలవాలని ఉబలాట పడ్తూన్న ప్రజల వద్దకు జవహర్ లాల్ నెహ్రూ చేరారు.

జనాలను కంట్రోల్ చేయడం క్లిష్ట సమస్య ఐంది. సింగ్ తన లాఠీ (swagger stick)ని ఝళిపిస్తూ  జవహర్ లాల్ నెహ్రూ వెనుక బయల్దేరారు. గుంపులను అదుపు చేయడం దుస్సాధ్యంగా మారింది. నెహ్రూ చుట్టూ కమ్ముకున్న మనుషులను లాఠీని విసురుతూ, సింగ్ కాపలా కాస్తున్నాడు.

అకస్మాత్తుగా తన చేతిలోని లాఠీని ఎవరో లాగి విసిరేసారు. సింగ్ ఆగ్రహంతో చుట్టూ చూసాడు. తీరా చూస్తే అలా లాగి విసిరేసిన వారెవరో కాదు - జవహర్ లాల్ నెహ్రూ. లాఠీ కఱ్ఱను లాగి తీసుకుని, తన వైపు చూపిస్తూ అడుగుతున్నాడు-

“ఏమిటి నువ్వు చేస్తూన్న పని?”

నెహ్రూ కరకుగా అడిగాడు. అలా కర్కశంగా అరిచి, వెంటనే తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కి ఆర్డర్ జారీ చేసాడు-“ఈతనిని ఈ పని నుంచి పంపిచేసేయండి.”

కనురెప్పల కరకట్టలను దాటి వస్తూన్న కన్నీళ్ళను ఎలాగో ఆపుకుంటూ అక్కడి నుండి మహాన్ సింఘ్ బయస్ నిష్క్రమించారు.

******

కాస్సేపటి తర్వాత తర్వాత ప్రైమ్ మినిష్టర్ నుంచి సింగ్ కి ఆదేశం (సమ్మన్లు) వచ్చింది. “నా ఉద్యోగానికి ముప్పు వచ్చింది.” అనుకుంటూ గడగడ వణుకుతూ అక్కడికి చేరారు సింగ్.

మొరార్జీ దేశాయి, తతిమ్మా లీడర్లతో   కూర్చుని ఉన్నారు నెహ్రూ.    

“నువ్వేం చేద్దామనుకున్నావు??” సింగ్ ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఎలాగో పలికాడు – నత్తి నత్తిగా ఇలాగ “సర్! బ్లూ బుక్ ను నేను ఫాలో అయ్యాను.”

Blue Book  ప్రముఖ వ్యక్తులు (VVIP security measures) వచ్చినప్పుడు వాళ్ళకు భద్రత ఎలాగ కల్పించాలో తెలిపే బుక్. సెక్యూరిటీ ప్రమాణాలను వివరిస్తూన్న విధుల నియమావళి పట్టిక రాసి ఉంచిన పుస్తకము                                                  

సెక్యూరిటీ ఆఫీసర్, మొరార్జీ దేశాయి లు ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకి కొంచెం వివరంగా చెప్పారు.

నెహ్రూ కొంతసేపు మౌనంగా ఊరుకున్నారు. ఒక క్షణం ఊరుకున్న తర్వాత తల పంకిస్తూ అన్నారు “యంగ్ మాన్! వాస్తవం చెప్పాలంటే నువ్వే రైటు. నాదే పొరపాటు. అయాం సారీ!”

మహాన్ సింగ్ బయస్ ఆ సంఘటనను తలుచుకుంటూ చెబ్తూంటారు,

“కేవలం ఒక junior police officer వద్ద తన తప్పును ఒప్పుకునారు అంతటి ప్రధాన మంత్రి. అలాగ తన తప్పును తాను తెలుసుకుని, వెంటనే పశ్చాత్తాపంతో నెహ్రూజీ ఆడిగారు. అదే ఆయన గొప్పదనము.”

పండిట్ జీ అలాగ సారీ చెప్పగానే అప్పటిదాకా బిగబట్టున్న అశ్రువులు ధారాపాతంగా వెలువడినవి.

“ఈసారి నేను నా కళ్ళలో నీళ్ళను ఆపుకోవడానికి ప్రయత్నించ లేదు. అవి ఆనందబాష్పాలు కదా మరి!”

*******
జవహర్ లాల్ మరియు బ్లూ బుక్
User Rating:  / 1
Member Categories  - తెలుసా!
Written by kadambari piduri
Thursday, 01 May 2014 10:00
Hits: 197

అఖిలవనిత
పేజీ వీక్షణ చార్ట్ 26445 పేజీవీక్షణలు - 716 పోస్ట్‌లు, చివరగా Apr 24, 2014న ప్రచురించబడింది
Telugu Ratna Malika
పేజీ వీక్షణ చార్ట్ 3507 పేజీవీక్షణలు - 116 పోస్ట్‌లు, చివరగా Apr 17, 2014న ప్రచురించబడింది



Thursday, November 22, 2012

ओम లిపిగా శివ ధనువు



సీతమ్మ కనుబొమ్మలు; స్వర్ణ ధనుసు పోలిక
శివధనువును చిటికెలోన; ఎత్తి, జరిపినట్టి, పూ బోణి  
;                       ఈమేనా? కడు వింత! ||

విల్లుతోనె ముడిపడినది జానకీ జీవితము ;
విలు వంపుల మేని హొయలు నవ రత్న నిధుల విలువెత్తు!
ఆ......! ఔనా? ఆహా ఔనా? ఔనౌనా? || 
స్వయంవరమండపమున
కోటిలోన ఒక్కనిగా; ఆ నడచి వచ్చునది ఎవరే?
నీలమోహనుడు, మేఘశ్యాముడు ఎవరమ్మా, చెప్పమ్మా ||

మునిజననుత, లోక వినుత; శ్రీరాముడు; ఓ చెల్లీ!
అతనే కోదండపాణి, జగదేకవీరుడౌనమ్మా! ||
;

;
విలువేదిక వద్ద కేగి, కాలి బొటన వ్రేలి క్రింద;
లోహ ధనువు నట్టిపెట్టి
నారిని కొన కొమ్ముకు ఒడుపుగాను కట్టబోయె ||
(మన రాములు
సంధించెనొ? సారించెనొ?
ఇటు వింటి నారినీ;
సారించెను దృక్కులనూ 
అటు సీత పైన కాబోలును)  

ఫెళ్ళున విరిగిన దదేమి? 
:        “ఆ ధూర్తుల గర్వమ్ములు!”
ఝలు ఝల్లున + తొణికినవేమి? 
:        “సీత ఎడద మైమరపులు!” 

లోకములకు ఆదర్శప్రాయ దాంపత్యపు సూచిక 
;                                      ఈ ఈశు ధనువు
అది "ఓమ్ కారము - ప్రతిబింబము!

;

;
సీతావరమాలిక లిక శ్రీరాముల గళ సీమలో
ఓమ్ లిపిగా తనరంగా;  
'ओम ओम' 'ओम 
'ओम' 'ओम' ओम'
ఫణి భూషణు భుజములందు సర్పమ్ములు నాట్యమాడె! || 


శ్రీరామ! జయ రామ! జయ జయ రామా!శ్రీరామా!


శ్రీ రామ! జయ రామ! జయ జయ రామా!శ్రీరామా!  
||



సీతావరమాలిక లిక శ్రీరాముల గళ సీమలొ/ లో 

Monday, October 25, 2010

ఏనుగు” కు అనేక ప్రత్యేకతలు






















ఐదు మూరల ముక్కు ఉన్నది
రెండు బారల పళ్ళు కలిగినది
ఎవరో చెప్పవె, చిటి పాపా!

1.ముక్కుయె తొండము
పళ్ళు దంతాలు
గణపతి దేవుని ముఖ విలాసము
జంతువులందున ఘనమగు హస్తి=ఏనుగు లేమ్మా!

2. మైసూర్ దసరా సంబరమ్ములు
తమిళ నాడులో, కేరళ సీమల
మావటీలతో చేసే దోస్తీ
ఏనుగు పైన అంబారీ
అంబారీలో సవ్వారీ
అంబరమందే హ్యాపీలు

3. చదరంగమున హస్తి దళములు
ఆటలు మెదడుకు పెట్టును పదునును
నాణెము గైకొని, మాకీయవయా ఆశీస్సులను
అందుకె నీకు వందనమ్ములు శత కోటి నీకయా,
అందుకొనవయా! గజరాజా!

(By kadambari piduri, Sep 18 2009 5:53AM)


హిందువుల ఆరాధ్య దైవమైన వినాయకునికి ప్రతి రూపము "ఏనుగు".
జంతు కారుణ్యము దృష్ట్యా వీని పరిరక్షణ చాలా అవసరము.
శత కోటి ప్రాణి కోటి నివాసముగా ఉన్నప్పుడే ధరిత్రి కళ కళ లాడుతూంటుంది.
వైవిధ్య భరితమైన జీవ కోటితో
ప్రకృతిలోని సమ తౌల్యతను కాపాడవలసిన బాధ్యత పౌరులకు ఉన్నది.
ఐన "గజేంద్రుడు",మన జాతీయ జంతువుగా నిర్ణయించబడటము సానుకూల పరిణామం.
జంతు ప్రపంచములోనే “ ఏనుగు” కు అనేక ప్రత్యేకతలు ఉన్నవి.
పెద్ద సైజు, వింత రూపం గజ రాజువి.
చేటల్లాంటి చెవులు, భారీ రూపం, ఎక్కువగా - నల్ల రంగు, శాకాహారి
సాధారణంగా జంతువులకు కొమ్ములు తల పైన ఉంటాయి,
కానీ “దంతముల రూపం”లో– నోటి వద్ద కలిగి ఉండి,
తొండము కలిగి ఉన్న ఏకైక జంతువు ఏనుగు
ఏనుగుకు బహుళ ఉపయోగ కరంగా ఉంటూన్నాయి.
కుక్క తర్వాత, ఆప్యాయతలకు, యజమాని పట్ల అనుకూలతలకు

Tuesday, June 30, 2009

రంగులు,రమణీయమైన మోజులు


రంగులు - రమణీయమైన మోజులు ;

======================

"ఇంద్రధనుస్సు" అనగానే సప్త వర్ణ సమ్మేళన సుమనోజ్ఞ వర్ణ వేదికా తోరణం చటుక్కున మన తలపులలో మెదులుతుంది. ఎరుపు, నీలం, ఆకు పచ్చ ప్రధానమైన రంగులు. వివిధ నిష్పత్తులలో మూడింటి మిశ్రమాలే అనేకనేక వర్ణాలను సృజిస్తున్నాయి.

మనస్సుకు రంగుల పట్ల గల ఆకర్షణయే, అనేక పండగలకూ, పబ్బాలకూ; రంగవల్లికలు, చిత్రలేఖనము ఇత్యాది అనేక కళలకు, దేవతారాధనల వేడుకలకు, తిరణాళ్ళకు ఎన్నింటికో పునాదులను వేసిందని చెప్పవచ్చును.

"ఆయా రంగులను ఇష్టపడేవారు ఎలాంటి స్వభావాలను కలిగి ఉంటారు?" అనే విషయం మీద అనేక ఆసక్తికరమైన ఫలితాలు వెలువడుతున్నాయి.
*********************************************
"ఎరుపు" రంగును ఇష్టపడే వారికి కోపం అధికంగా కలిగి ఉండే స్వభావాన్ని కలిగి ఉండే అవకాశం ఉన్నది. వారికి తమ పట్టుదల, పంతం నెగ్గి తీరాలనే ఆవేశం, మొండితనం ఉంటాయి. అలాటి వారు ఆడంబరాలకు ఎక్కువగా వెచ్చిస్తారు. ముఖ్యంగా రమణులకు రంగుల పట్ల మక్కువ ఎక్కువ. పిల్లలు ఎక్కువగా లేత రంగులను, పెద్దలు ముదురు రంగులను ఇష్టపడతారు.

"పసుపు" వన్నెను ఇష్టపడే వారికి జీవితంలో అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటుంది. వీరికి ఆవేశం తక్కువగా ఉంటుంది. ఐనప్పటికీ కృత నిశ్చయాన్ని, దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు.

"ముదురు నీలం" వన్నెను ఇష్ట పడే వారు భద్రతకై ఆరాటపడతారు.

"ఆకు పచ్చ, నీలం వర్ణాలు" ప్రియమైన వారికి జీవితం పట్ల ఎంతో భద్రతా భావం కలిగి ఉంటారు. వీరు బ్రతుకు పట్ల ఎంతో విశ్వాసము కలిగి ఉండి, స్థిమితంగా ఉంటారు కూడా.

ఆభరణాల ఎంపికలలో కూడా రంగుల పట్ల గల మక్కువ, అభిరుచులు తెలుస్తూంటాయి.

"నీలం రంగు" శాంతిని ప్రసాదిస్తుంది.




*** *** *** ************************************

పురాణ, ఇతిహాస గాధావళిని అనుసరించి, వానిలోని వర్ణ విశ్లేషణలను గమనించండి, ఎంతో ఆశ్చర్యం కలుగక మానదు. త్రిమూర్తులు, వారి భార్యల ఆహార్యము, నివాసముల ఎంపిక విభిన్న తరహాలలో గోచరిస్తాయి. "వీణా పాణి", "పుస్తక ధారిణి" ఐన శ్రీ సరస్వతీదేవి కువలయ నివాసిని, ఆమె తెల్లని కలువ పూవులో ఆశీనురాలై, సారస్వత జగత్తును అనుగ్రహిస్తున్నది.


*****

శ్రీ లక్ష్మీ దేవి పద్మాలయ, తామర పూవు ఆమె నివాసము. శ్రీ విష్ణుమూర్తి పీతాంబరధారి, పన్నగ శయనుడు, వైకుంఠ నివాసి.

పాపం! భోళా శంకరుడు, విభూది ప్రియుడు. ఐతే, దేవి సకల ఆభరణాలంకృత.


*** *** *** ***

స్త్రీలు సహజంగా అనేక రంగులని ఇష్టపడతారు. అందుకనే పేరంటాలకు, పెళ్ళిళ్ళకు, పండగలకూ పబ్బాలకూ వన్నె వన్నెల పట్టు చీరలు రెప రెపలాడుతూ నిండుదనాన్ని చేకూరుస్తాయి.

కనుదోయికి ఆహ్లాదాన్ని కలిగించే "బొమ్మల కొలువు" వంటి వేడుకలు, మహిళామణుల నిర్వహణలో శోభాయ మానంగా సందర్శకులను అలరిస్తూ ఉంటాయి.

వర్ణ సమ్మేళనాల ప్రభావం మీద పరిశోధనలు సరి కొత్త మలుపు తిరిగాయి. వైద్య రంగంలో ప్రయోగాలు దిశగా సాగుతున్నాయి. "బాబిట్" మొదలగు వారు ప్రకృతి వైద్యంలో విషయ పరిజ్ఞాన్ని ఉపయుక్త పరుస్తున్నాయి.


*** *** *** ***

బట్ట తల నివారణకై నీలి వర్ణోదకమును వాడి, అద్భుత ఫలితాలను పరిశోధకులు వెల్లడించారు. నీలం రంగు సీసాల్లో నీళ్ళు పోసి, సూర్యరశ్మిలో ఉంచాలి. అలాంటి నీలి వర్ణోదకమును రెడీ చేసుకోవాలి. బట్ట తలకు ఆలివ్ ఆయిలును పట్టించి తరువాత నీలి వర్ణోదకమును వెంట్రుకల కుదుళ్ళకు మర్దన చేస్తూ, వాడిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ప్రకటించారు.

ఇలాంటీ సిద్ధాంతాలను ఆధారము చేసుకుని ఇప్పుడు ఇంటి గోడలకు, గదులకు వైవిధ్యభరితముగా వివిధ వర్ణల సున్నాలను, డిస్టెంపరులనూ వాడుతున్నారు.

నవ వధువు చేతిలో గోరింటాకుకు, పెదవులలో తాంబూల రాగము, పాదములకు పారాణి సుందర మధు హాసాలాను చిందిస్తాయి. పెళ్ళిళ్ళలో రంగు రంగుల పూలను అలంకరిస్తారు. ఈనాడు గోరింటాకు, ఒక అద్భుతమైన కళగా "మెహిందీ ఆర్టు"గా కొత్త పుంతలు తొక్కుతూ, అభివృద్ధి గాంచుతున్నది.

ఇలాగ అడుగడుగునా నిత్య జీవితంలో రంగుల సొగసులు ప్రధాన నేస్తాలుగా మారి, మానవుని మనస్తత్వానికి అద్దం పడుతూ, అందరినీ పలకరిస్తూ, మానసికోల్లాసాన్ని కలుగజేస్తున్నాయి,

Thursday, June 18, 2009

కబీరు సుభాషితాలు ( పార్టు ౨ )

కబీరు సుభాషితాలు ;;;;;;;(పార్టు ౨)

============

కబీరు తన జీవితమునే ప్రతిఫలింప జేస్తూ,

ఉటంకించిన అనేక "సుభాషితము"లు

ఆ కాంతి రత్నములు ఇవిగో!

1)"మాయ జిలుగు జరీల ;లౌకిక ,వస్త్రములను, కట్టినాను.

2)"తుహిన, కణము ,దాహమును ,తీర్చునా?

3)"వంగిన వాడు,నీరు త్రాగును;నిక్కిన వానికి ,దప్పిక తీరదు."

4)"'మాయ 'అనునది ,బహు మాయల మారి;

అది , వన ,జంగమ,సాధువులనూ ,కట్టి వేసినది;

పూజా స్వాములను ఆక్రమించినది;

అర్ధ విచార పడియలను , లో బరచుకున్నది.

అందరినీ త్రాడుతో కట్టి , వేసినది."

5)"పర మాత్మను చేరుట కష్టము.;భాగ్య వశాత్తూ చేర గలిగి నప్పుడు విడి పోవలదు.

అట్లు భగవంతునితో వేరు అయినప్పుడు,

శిరసున అదృష్ట మణిని కలిగి ఉన్నవారు మాత్రమే,,

తిరిగి ఆ భగవానుని చేర గలరు."

6)కబీరు దాసు తన అన్వేషణా యాత్రను గురించి ,

వ్యక్తీకరించిన పద్యాలు అమూల్య చారిత్రక నిధులు.

"కృత యుగమున "పావు కోళ్ళు"వేసుకునాను.

త్రేతా యుగమున "పతాక"ను పట్టుకుని నిలిచాను.

ద్వాపర యుగమున నడిమిని నడిచే (కడలి)బిందువును ఐనాను.

కలి యుగమున ఖండ ఖండాంతరములను తిరిగాను.
***********************************************
ఈ యాత్రావ్వేషణలో , వివిధ అనుభవాలను రుచి చూసాడు కబీరు దాసు.

శ్రీ కృష్ణ భక్తురాలైన 'సతీ సక్కు బాయి 'గృహమునకు సాధు బిక్షకై వెళ్ళాడు కబీరు.

ఆమె అత్త పరమ గయ్యాళి.

కోడలైన సక్కు బాయిని విపరీతముగా వేధిస్తూ ,ఆరళ్ళు పెట్టేది.

అపుడు తటస్థ పడిన కబీరు కూడా ఆ అత్త గారి తిట్లూ,దూషణలకు , గురి , కాక ,తప్ప లేదు.

బహుశా అలాంటి సందర్భములలో ద్యోతకమైన భావాలు

ఆయన "వచనము 'లలో అగుపిస్తాయి.


" సప్త సముద్రాలనూ తిరిగి "జంబూ ద్వీపము"(=భారత దేశము)ను చేరాను.

పర నిందను చేయని వారు అరుదుగా కన పడ్డారు."

ఇవి నేటికీ అక్షర సత్యములే కదా!

2)"సాధువుల జాతిని అడగ వద్దు.

వారి జ్ఞానమును గూర్చి మాత్రమే యోచించు.

మనకు కావలసినది ,లోపల ఉన్న కత్తికి ఎంత పదును ఉన్నది? అనేకానీ,

దాని పైన ఉన్న 'ఒర ' ఎలా ఉన్నదీ ! ,అని కాదు ,కదా!"

ఈ భావముతో ఉన్న ఈ "దోహా"ను తిలకించండి.

"జాతి న పూఛే కీ :

పూఛిలీ జయే జ్ఞాన్ ;

మోల్ కరోతర్ వార్ కా ;

పడా రహన్ దో మ్యాస్."

కబీరు వంటి సాధువులు,

లోకమున శాంతిని నెల కొల్పుటకై శ్రమించిన "మహాత్ములు".

జనులకు సదా ప్రేమను పరస్పర అను రాగమును ,

శాంత జీవనమును,మనో , తృప్తినీ , బోధిస్తూనే ఉన్నారు.

**************************************************

"అహం బ్రహ్మాస్మి."అనే ఉపనిషద్ వాక్కులలో సారము ఇదే!

కబీరు ఇలాగ అన్నాడు ,

"నేను ఉండినప్పుడు 'గురుడు 'కాన రా లేదు.

ఇప్పుడు 'గురుడు '(అనగా భగవానుడు)ఉన్నాడు.

నేను లేను.(దైవములో , లీనము , ఐనాను.)

ప్రేమ మార్గము ఎంతో ఇరుకైనది.

అందు రెండిటికీ , తావు , లేదు.(ఒక్కటి మాత్రమే అక్కడ నెల కొన గలదు.)"

అని కబీరు దాసు అన్నాడు.

నిజముగా ఇవి,"గులాబీ పూవుల గుబాళింపులే కదూ!

మరి కొన్ని చక్కెర పలుకులు చదవండి

"ఈ కబీరు తన కడుపులో , ప్రేమ 'అనే పాత్రనే అట్టి పెట్టు కున్నాడు.

ఆ ప్రేమ రోమ రోమమమున ఉద్భవిల్లుచూ తిరుగాడు చున్నది.

మరి అంత కన్ననూ తినుటకై మంచి పదార్ధము ఏమి దొరుకును!?!

"''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
యోగాభ్యాసములు,యోగాసనములు

కబీరుకు తెలుసుననేందుకు ఈ పద్యములు నిదర్శనములు.

"ఇడ" పడుగుగానూ ;

"పింగళ"ను పేక గానూ :

"సుషుమ్న"ను దారముగానూ స్వీకరించి , ఈ దుప్పటిని నేసాను."

పడుగు,పేకలు మున్నగు పదములు ,నేత వృత్తికి సంబంధించినవి.

ఆ నాటి సమాజములో "చేనేత "వృత్తి అత్యున్నత గౌరవమును పొందినది.

వాణిజ్య పరముగా మన చేనేత వస్త్రములు ,

ప్రపంచములోనే మన భారత దేశమును అగ్ర శిఖరములపై నిలిపినది.

కబీరు దాసు నుడివిన దోహాలు,పద్యములు ,

వృత్తుల విలువను తెలిపే వాడుక మాటలను మనకు అందించిన మేధావి.

సాధారణముగా "సమ కాలీనులు తమ సాటి వారి చేతలను మెచ్చుకోరు."

ఈ కోణములో చూస్తే, కబీరు దాసు నిజముగా అదృష్ట వంతుడే!

ఆతను తన సమ కాలీన సమాజములో మన్ననలను పొందిన 'భాగ్య శాలియే'!

కనుకనే ,"అభంగములు"రచించిన

ప్రసిద్ధ మరాఠీ కవి "భక్త తుకారాము" ఇలాగ అన్నాడు కదా!,

"నాకు నలుగురు మిత్రులు లభించినారు.

వారే జ్ఞాన దేవ్,నామ దేవ్,ఏక నాధ్,కబీర్‌లు."

****************************************************
(1జూన్ ౨౦౦౯ న

కబీరు దాసు (పార్టు ౧)

Wednesday, June 17, 2009

తొండైమాను చక్రవర్తి ; "ఆనంద నిలయము"



మీకు ఆకాశరాజు ఎవరో తెలుసా ?శ్రీ వేంకటేశుని పత్ని "పద్మావతి"కి కన్న తండ్రి అయినట్టి ఆకాశ రాజు .
శ్రీ పద్మావతీ దేవికి చిన్నాయన అనగా ఆకాశ రాజుకు తమ్ముడైన రాజు "తొండై మానుడు".
ఇతడే తొండమాన్ చక్రవర్తి అనే పేరుతో కూడా అన్నమయ్య కృతులలో వినుతి కెక్కాడు
*************************************************

ద్వాపర యుగం తర్వాత కలియుగారంభం అవసాగినది.
మహా భారత యుద్ధం అనంతరం
"మానవ జాతి సమాజము పునర్నిర్మాణము" మరల కొనసాగినది.
విక్రమార్కుడు మున్నగు ప్రభువుల తర్వాత చంద్ర వంశములో జన్మించిన," సుధర్ముడు"
పూర్వ జన్మలో గొప్ప పుణ్యము చేసుకొనెను.
సుధర్మునికి ఆకాశ రాజు, తొండమానుడు అనే సుపుత్రులు ప్రభవించారు.
శ్రీ వేంకటేశునికి తన కుమార్తె పద్మావతీ దేవిని ఇచ్చి ,పెళ్ళి చేసిన పుణ్యచరితుడు
ఆకాశ రాజు.
పద్మావతీ పిన తండ్రి ఐన తొండైమానుడు చారిత్రక ప్రసిద్ధి కల వ్యక్తి.
శ్రీ తిరుమలేశునికి ఇతను "ఆనంద నిలయము"ను కట్టించెను.
"కపిల తీర్ధము"అనే పెద్ద చెరువును త్రవ్వించెను.
ఈ చెరువు జలములతోటే ఇదివరకు స్వామి వారికి అభిషేకములు నిర్వహించే వారు.
కపిల తీర్ధమే "తామర గుంట"గా ప్రసిద్ధి కెక్కెను.
తొండమానుడు శాతవాహనుల సైనిక దళాధిపతి. వీరాగ్రేసరుడు, గొప్ప విజేత.
ఈయనే నారాయణ వనమునకు పాలకుడు.
శైవ భక్తుడైన తొండైమాను చక్రవర్తి పరిపాలించిన సీమకు
"తోండ మండలము" అని పేరు కలిగెను.
ఈతని రాజధాని "కోట". తొండమానుని రాజధాని ఐన కోట శ్రీ కాళ హస్తికి 8కి.మీ. దూరములో ఉన్నది.
ఈ గ్రామమే ఇప్పుడు "తొండమనాడు"గా పేరు గాంచినది.
(టూరిస్టు డిపార్టుమెంటు ఈ సీమను కూడా అభివృద్ధి చేసి,
ప్రజలకు చారిత్రక అవగాహన కల్పించ వలసిన అక్కర ఉన్నది)

*************************************************************

చింతచెట్టు వింజామరగావెలసినవాడు అని ఏడుకొండలవాడినిఅభివర్ణిస్తారు.
కొండ కుంగినట్లుగా నిలచినదేవుడు (మలై కునియ నివు పెరుమాళ్‌)అనీ అంటారు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


శ్రీవేంకటేశ్వరుడు నిలిచినస్థానం తిరుమలకొండకు నాభి వలె ఉంటుంది.
చుట్టూ ఎత్తయిన కొండలు హరితపుష్పపురేకల వలె ఉంటాయి.
అర్చావతారంగా వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహంపై
తొలినాళ్ళలోసూర్యచంద్రులు ప్రకాశించేవారు.
వైష్ణవఆలయాలలో శ్రీవేంకటేశ్వరుడు తొలి ఏకధృవమూర్తి.
ఇతర దేవతలులేకుండా ప్రధాన దైవం మాత్రమేఉండడాన్ని" ఏకధృవమూర్తి అంటారు".

తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడు వెలసినతర్వాతే
హిందూ శిల్ప, ఆగమ శాస్త్రాలురూపొందాయని అంటారు.
ఏకధృవమూర్తిగా వెలసినశ్రీవేంకటేశ్వరునికి తొలినాళ్ళలో ఆకాశమే పైకప్పు.
వైకుంఠం నుంచి శ్రీవేంకటేశ్వరుడు దివ్యవిమానంలో అవతరించారని
ఆ విమానం మానవులకుకన్పించదని
భక్తులకు కన్పించేవిధంగాతొండమానుడు విమానాన్ని నిర్మించాడని
పురాణాలు చెబుతున్నాయి.

గోపురాన్ని లేదా గర్భగృహంపై గల ఎత్తైన నిర్మాణాన్ని" విమానం" అంటారు.
తిరుమల గర్భ గృహంపైగల విమానాన్ని "ఆనందనిలయం " అంటారు.

అసలుసిసలైన మేలిమి బంగారపు రేకులతోధగధగలాడే
ఆనందనిలయం లక్ష్మీపతిభక్తులకు పరమానందం కలిగిస్తుంది.
పురావస్తు ప్రమాణాల ప్రకారం
క్రీ.శ. 12వశతాబ్ది ప్రాంతంలో ఆనందనిలయాన్ని నిర్మించారు.
విజయనగరరాజు వీరనరసింగదేవుడుతన ఎత్తు బంగారాన్ని ఆలయానికి ఇచ్చారు.

ఆబంగారంతో తొలిసారిగా ఆనందనిలయానికి పూత వేయించారు.
నరసింగదేవుడు 1262 వరకు రాజ్యపాలనచేశారు.
1251 నుంచి 1275 వరకు పరిపాలించినపాండ్యరాజు "జాతవర్మసుందరపాండ్యన్"
‌ విమానంపైబంగారు కలశాలను ఏర్పరచారు.

కుమార కంపనవడయార్‌కు సేనాని అయిన సాళువమంగిదేవుడు
1359లో మరోసారి బంగారు తాపడంచేయించారు.
2వ దేవరాయలు కొలువులోమంత్రి అయిన

మల్లన్న 1444 ప్రాంతంలోఆనందనిలయానికి మరమ్మతుచేయించారు.
9-9-1518న బహుధాన్యసంవత్సరంలో
త్రిసముద్రాధీశుడు శ్రీకృష్ణదేవరాయలువిమానాన్ని మెరుగుపరచి
బంగారు తాపడంచేయించారు.

కంచికి చెందిన కోటికన్యకాదానం తాతాచార్యులు 1630లో బంగారు పూతపూయించారు.
1908లో మహంత్‌ ప్రయాగదాస్‌బంగారు కలశాలను మరోసారి ఏర్పరచారు.
1958లోతిరుమల తిరుపతి దేవస్థానం ఆనందనిలయాన్నిపూర్తిగా పునర్నిర్మాణం చేసింది.
అప్పట్లో 12లక్షల రూపాయల విలువ చేసే 12వేలతులాల బంగారం వినియోగించి
18 లక్షల రూపాయలఖర్చుతో 5 ఏళ్ళలో నిర్మాణం పూర్తి చేశారు.
27 అడుగుల4 అంగుళాల భుజపు కొలత 37 అడుగుల 8 అంగుళాలఎత్తుగల చతురస్రాకారపు
"ఆనందనిలయానికి " 3అంతస్తులు.
మూల విగ్రహాన్ని దర్శించుకున్నప్పటికితనివి తీరని భక్తులు
ఆరాధనగా చూసే విమానవేంకటేశ్వరుడు ఆనందనిలయపు 2వఅంతస్తులో ఉంటారు.
*************************************************
తింత్రిణీ మూల సంభవుడు ,అనగా చింత చెట్టు వింజామరగా కలిగి ,
తరు మూలము నివాసముగా కల వాడు అని అర్ధము.

Thursday, April 23, 2009

బహు ముఖ ప్రజ్ఞా శాలి - వరాహ మిహిరుడు



క్రీ. శ. 499 నాటి వాడైన "వరాహ మిహిరు" ని అద్భుత దార్శనిక, ఖగోళ పరిశోధనలు మన భారత దేశమునకే గర్వకారణము. వరాహ మిహిరుడు ఉజ్జయినీ సమీపములోని "కాంపిల్య పట్టణము" లో జన్మించాడు. ఈతని తండ్రి పేరు "ఆదిత్య దాసుడు".

వరాహ మిహిరునికి ఆదిత్య దాసు బాల్యమునుండే జ్యోతిష్యములో జిజ్ఞాసను కలిగించాడు.
"లఘు జాతకము, బృహజ్జాతకము, బృహత్ సంహిత, వివాహ పటలము, యోగ యాత్ర, పంచ సిద్ధాంతిక"అనే అయిదు మహా గ్రంధాలను రచించాడు వరాహ మిహిరుడు. వీనిలో "వివాహ పటలము, యోగ యాత్ర"లు దొరకలేదు. అవి నేడు అనుపలబ్ధ్యములు!

"ప్రాచీనులు రచించిన గ్రంధములను నేను ఆమూలాగ్రమూ పఠించాను. ఆ విజ్ఞానముతోనే, నేను ఈ గ్రంధములను వెలయించాను" అని వినమ్రముగా చెప్పాడు అతను.
"సారస్వత మహాముని, ప్రజా పతి మనువు వాక్కులను గ్రంథస్థం చేస్తున్నాన"ని వరాహ మిహిరుడు చెప్పాడు.

తన పూర్వీకుల అమూల్యమైన విజ్ఞాన సంపదలను, తన తర్వాతి తరాల వారికి అందించే బృహత్ బాధ్యతలను, తన భుజ స్కంధాల మీద మోసిన ధన్య మూర్తి వరాహ మిహిరుడు.

ఆతని గ్రంథస్త విశేషాల పట్టిక

1. పంచ సిద్ధాంతిక - కొన్ని రకాల సాధారణ యంత్రాలను గూర్చిన వివరణలు, భూగోళమునకు సంబంధించిన విశేషాలు.

ఇందు లోని 13 వ అధ్యాయము
"త్రైలోక్య స్థానము". "రెండు అయస్కాంతాల మధ్య లోహ శకలము వలె ఏ ఆధారమూ లేకుండానే తారా గణమూ అనే పంజరములో భూగోళము పరిభ్రమించు చున్నది" అని నిర్వచనము నిచ్చాడు. టెలిస్కోపు వంటి ఘనమైన శక్తివంత పరికరాలేమీ లేని ఆ రోజుల్లోనే, ఈ అత్యద్భుత ప్రాకృతిక విశేషాలను లోకానికి అందించిన మేధావి వరాహ మిహిరుడు.

2. బృహత్ సంహిత - ఒక్కో అధ్యాయము చొప్పున 105 విషయాలకు విపులీకరణ.

అనేక ప్రపంచ భాషలలోనికి అనువాదము చేయ బడిన ఉద్గ్రంధము ఇది. ఈ సంహిత లో
  • సృష్టి ,తారా ,గ్రహ చలనాలు, ఋతువులు, ఉల్కా,హరి విల్లు వంటివి ప్రభవించుటకు గల హేతువులు, సూర్య, చంద్ర , గ్రహచలనాల వలన, వాని సంచారాల వలన, భూమిపైన ప్రాణులకు కలిగే సత్ప్రభావాలు, దుష్ప్రభావాలు.

  • వాస్తు ప్రకరణము -ఇళ్ళను ఎలాంటీ స్థలములలో కట్టుకో వచ్చును? ఎలాంటి కలపను వాడాలి లాంటి నేటి సైన్సులో నిరూపితమైన అంశాలతో ఆ నాడే మన దోసిట్లో పెట్టాడు అతను.
3. బృహజాతకము - ఇది అందరినీ ఆకర్షించే గ్రంధము.

మానవుని పూర్వ జన్మలు, అనేక జన్మ విశేషాలను పొందు పరిచాడు. సంజ్ఞలు(ప్రతీకలు), గుర్తులతో నిర్మిచిన శాస్త్ర గ్రంధ రాజము ఇది. మనుష్యులు ఎక్కడ, ఎలాగ జన్మిస్తారు? వారి ఆకారాలు,
స్వరూప, స్వభావాలు నిర్ణీత పద్ధతిలో నిర్మించ బడుతాయని , నిరూపిస్తున్న సిద్ధాంత పరంపరలు ఈ పుస్తకము ఆతని అసామాన్య ప్రతిభకు నిదర్శనము.

4. లఘు జాతకము:

పై
"బృహత్ జాతకమునకు" సంక్షిప్తీకరణముగా విరచించ బడిన పొత్తము ఇది. "బృహత్ జాతకము" ను మేధావులు మాత్రమే అర్ధము చేసుకొన గలరు. అదీ గాక ఇది గ్రంధ విస్తృతీలో చాలా పెద్దది. అందు చేతనే, సాధారణ ప్రజలకు సులభ గ్రాహ్యముగా, అందు బాటులో ఉంచే ప్రయత్నమే ఈ "లఘు జాతకము" . ఈ క్లుప్తీకరణ, విద్యార్ధులకు "ప్రాధమిక అవగాహనాను కలిగించగల అనుబంధ గ్రంధము"అని పేర్కొన వచ్చును.

మహా మేధావి వరాహ మిహిరుని గురించిన మరిన్ని విశేషాలను మళ్ళి తెలుసుకుందాము.


వరాహ మిహిరుడు - భౌగోళిక పరిశీలన



క్రీ. శ. 499 వ సంవత్సరము నాటికే, భూమి అంతర్గత పొరలను గూర్చి వివరించిన మేధావి వరాహ మిహిరుడు. భూమి లోపల ఏ యే లోహాలు, ఎక్కడెక్కడ దొరుకుతాయో, గుర్తు పట్టడానికి వెలువరించిన అనేక కొండ గుర్తులు ఆచరణ యోగ్యమైనవే!

కొన్ని ఉదాహరణలను పరికించుదాము.....

కాటుక పిట్ట వలన ఆనవాళ్ళు:
1) కాటుక పిట్ట సంగమించిన చోట "నిధి" దొరుకుతుంది.

2) కాటుక పిట్ట త్రొక్కిన చోట "అభ్రకము" దొరుకుతుంది.

3) కాటుక పిట్ట మలవిసర్జన చేసిన చోట "బొగ్గులు" లభిస్తాయి.
ఇలాగే భూమి లోపలి పొరలలో నీరు, మంచి నీళ్ళు ఎంతెంత లోతులో ఉంటాయో కనుగొనేందుకు ఆతడు గైకొన్న ఆధారాలను గమనిస్తే సంభ్రమాశ్చర్యాలకు లోను ఔతారు.

అధికముగా మొక్కలు, పొదలూ మొలిచిన చోట్లు; చెట్లు, చేమలు ఉన్నచోట్లు ఆతని గవేషణకు మూలాధారాలు ఐనాయి. (నేడు వనాలు, చెట్లు ఛిన్నాభిన్నమౌతున్నాయి. అత్యాశా పరుల చేతుల్లో ప్రకృతి మాతకు రక్షణ ఏదీ? ఆనాడు వరాహ మిహిరుడు సూచించిన తరు, పశు, పక్ష్యాదులను వీక్షించాలంటే, భూతద్దమును పట్టుకుని బయలు దేరాల్సిందే కదా!)

తీయని మంచి నీళ్ళు దొరికే ప్రదేశాలను గుర్తించేందుకు ఉదాహృతమైన వరాహ మిహిరుని పరిశోధనలు కొన్ని:
1) నీలి మందు చెట్టు దగ్గర పాము పుట్ట గనుక ఉన్నచో, ఆ పుట్టకు దక్షిణ దిక్కు వైపుగా 'రెండున్నరగజాల' దూరములో, 'ఎనిమిదిన్నర గజాల' లోతున త్రాగడానికి యోగ్యమైన మంచి నీళ్ళు లభిస్తాయి.
2)“జంబూ వృక్షస్య ప్రాక్ వల్మీకో యది భవేత్ సమీపస్థఃత్ ,
అస్మాత్ దక్షిణ పార్శ్వే సలిలం పురుష్వయే సాధు”
అనగా - నిర్జల ప్రదేశంలో ఉన్న నేరేడు చెట్టుకు
తూర్పు దిక్కులో పుట్ట ఉండి ఉంటే,
దానికి దగ్గర్లో దక్షిణ దిశలో
2 పురుష ప్రమాణముల( 10 అడుగులు) లోతునందు తవ్వితే
అక్కడ అతి తీయని(sweet) జలనాడి ఉంటుంది -
అని నమ్మకంగా నుడివాడు వరాహమిహిరుడు.
వరాహమిహిరుడు ఎఱుక పరిచిన ఖగోళ దృశ్య విశేషాలలో కొన్ని:
1) సప్తర్షి మండలానికి, చక్ర భ్రమణము కలదు.

2)సూర్య గోళములో 33 మచ్చలు ఉన్నాయి. అవి రాహువు, కేతువు, తామస అగ్ని కీలలు.
అలనాడు వరాహ మిహిరుడు తెలిపిన భవిష్యత్ వాణిని తిలకించండి.
1) వాయు ప్రకోపితాల వలన సౌరాష్ట్ర, మగధ దేశాలలో భూకంపాలు సంభవిస్తాయి.

2) గురువు, శని గ్రహాలు రెండూ ఒకే నక్షత్ర దిశా స్థానములో వెలుస్తున్నాయి, అందు చేత క్రీ. శ. 1970 లలో (అనగా అక్టోబరు, నవంబరు లలో) పుర ప్రభేదములలో అంతర్యుద్ధాలు సంభవిస్తాయి.
ఉగాది ఎప్పుడు?

భారతీయులందరూ ఆప్యాయతతో చేసుకునే పండుగ "ఉగాది" .
కొత్త సంవత్సరమును ఉగాది పండుగగా ఆహ్వానిస్తున్నాము.
మరి ఈ ఉగాది నీ ఏ సమయములో నిర్ధారణ చేయాలి?
"బ్రహ్మాది యుగాది కృత్"
"బ్రహ్మ యుగావర్తః "
అనగా అది "వసంత విషువత్ కాలము"
ఈ నిర్ణయములో ఎంతో అనుకూలత,
భౌగోళిక పరిశీలనచే నెలకొల్పినదగుటచే,
ఎంతో సామంజస్యము కలిగి ఉన్నది.

ఈ రీతిగా వసంత కాలమును, ఉగాది
అని వరాహ మిహిరుడు నిర్దేశించిన స్వచ్ఛమైన నిశ్చయమైన నిర్ణయ,
ప్రజలచే ఆమోదించబడి,ఆచరించ బడుచున్నది కదా!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;