నటరాజు ఆడేనొహో!
నటరాజు నాట్యములు ఆడేనొహో! (అనుపల్లవి) ధిమ్ ధిమ్ ధిమితక ధిమి ధిమీధిమిం అనుచు // గంధర్వులు పాడగా కిన్నెరలు వీణలను మీటగా ప్రమధ గణములు ఢమరు ధ్వానములు ఎగయగా //ధిమ్్ // నెల వంక తొంగి వీక్షించగా అల గంగ ఉప్పొంగి పొరలగా చెలి హైమ మురిసి పులకించగా ఇల సస్య ధాన్యాభరణముల వెలయగా //ధిమి// కైలాస గిరియే కదలెను తమసు దిక్కులలోన చెదరెను ప్రణవ నాదమ్ములే మ్రోగెను నాట్య ప్రభాతమై ప్రకృతియె తనరగా //ధిమి// |
Views (70) | |
No comments:
Post a Comment