బ్రహ్మ లోకము నుండి స్వప్న పల్యంకికలో శ్రీ వాణి "కచ్చపి" వీణియాను కిన్నెరలు తెచ్చారు. బింభాధరి పెదవి పైన కదలాడెడు మధు హాసము నిదుర మబ్బు వీచికలలో సుతారముగ, సుతి మెత్తగ తియ తీయగ విన వచ్చెను. సంగీత శాస్త్రమందున నూతన ఒరవడుల కిపుడె శ్రీకారము చుట్ట బడెను. కొంగ్రొత్త శృతులు,గమకములను నేర్చిన గమ్మత్తు గీర్వాణముతో "కచ్చపి" దరహాసమ్ముతొ శ్రీ శారదాంబనలరించగ మరాళమ్ముపైన తాను వయ్యారముగా వెడలెను! |
No comments:
Post a Comment