
మనసు పర్ణశాల!
పల్లవి మాయ పొరల దాటి, దాటి అమేయ రూపు మదిని తలచి పయనించరె! ఓపికతో! అను పల్లవి రమా నందు తలువరే! పరమానంద స్వరూపుని కొలువరే! 1)పత్తి లేక వత్తి ఎటుల? ప్రమిద లేక నూనె ఎటను? దివ్వె లేక వెలుతురెలాగ? జ్ఞాన జ్యోతి వెలుగెలాగు? ఆ దైవమ్ము కృప వలయును శాంత చిద్విలాస మూర్తి కొలువైన పర్ణ కుటీరముగా ఈ మది వెలిసేందుకు! 2) పుడమి లేక నేల ఏచట? మన్ను లేక పైరు ఎచట? మబ్బు లేక వాన ఏటుల? వాన లేక నది ఎలాగు? మదిని భావ ధార లేక కవన మెటుల? భక్తి కవన ఝరీ ప్రయాణ మెటుల? |
Views (124 |
No comments:
Post a Comment