తిరుమలేశు సేవలలో !
(kavita) ;;;;;;
పల్లవి : శంఖ ,చక్ర, కౌమోదకి నందక, మోహన మురళీ ధారీ! అనుపల్లవి : ఇరు మూలల - దశ దిశలలో నళినాక్షా! నీ కలువ కనుల కోమలమౌ వీక్షణాలు ఇటు ప్రసరించిన క్షణాలు! ఈ క్షణాలు! ఇంతె చాలునయ్యా! ఇదే చిన్ని ఆశ! ఇది చాలును !చాలును! 1)పొగ మంచు తెరల కావల నొక మిణుకు తార సరళి జ్యోతి కన్నులారగా నేను తిలకించాలని ఆశ! చిన్ని ఆశ! ఇంతే! 2)నిదుర మబ్బు కలలన్నీ, స్వామి ఊసునందు హాయి చెమ్మగిల్ల వలెనంటూ ఆ వానలలో తనివారా ఎల్లరమూ తడవాలని చిన్ని ఆశ! అంతే! 3) పూలలోని పరాగపు-చిన్ని రేణువుగ నేను తిరుమలేశు సేవలలో తరియించిన చాలుననే ఇంపైన ఆశ! అంతే! |
Views (69) |
No comments:
Post a Comment