పాలడుగు ముద్రలు
By kadambari piduri
పల్లవి ''''' ''''''''' పాల్కడలి నుండి - అరుదెంచినావా? ఇపుడిపుడె విచ్చేసినావా? కౌస్తుభ హారీ! భోగీంద్ర శాయీ! ఇపుడిపుడె విచ్చేసినావా? అను పల్లవి''''''' '''''''''''''''''' నీ పాలడుగు జాడల - మరీచికా రేఖలు తన పాలిండ్లపై హత్తుకొనగా ధరణికి ఒత్తైన సంతోషము! పట్టరానంత సంతోషము మడుగు అడుగున నుండి అడుసు అడుగును తీసి అడుగులో అడుగేస్తు అడుగు తామర సామి! విచ్చేసినావా! నీ అడుగు పద్మాలతో కొలను పంకజ రాసి జత జేరి జోడీగ మంతనాలెందుకో? ఆ మర్మాలు ఏమిటో?! |
Views (88) |
No comments:
Post a Comment