Wednesday, April 22, 2009

భక్తి రస వాహిని ఇది





భక్తి రస వాహిని ఇది!



పల్లవి 

కోనేటి రాయనీ నామమ్మును 
దివిజులందరు వచ్చి 
తమకు బహుమతిగా 
ఈ భువిని యాచించేటి 
చోద్యమును చూడండి! 
ఆ చోద్యమే! బహు చోద్యము! 

అను పల్లవి 


కోనేటి రాయ! 
నీ నామమే 
బహు చోద్యమే! 
అమ్మమ్మ! విభవముల చోద్యమే! 

రాజీవ లోచనుని తలచిన ప్రతి మది 
రమ్య కాంచన ధామము 
మనసా! రమ్య కాంచన ధామము ! 

1)నిరుపమానందుని అరసిన ప్రతి హృది 
భవ్యమౌ కస్తూరి సౌరభమ్ 
భావమే కస్తూరి సౌరభం 

2)ముని గణ వంద్యుని భావముగ మలిచిన 
ఎడదయే కౌస్తుభ రత్నము ! 
మెరిసేటి కౌస్తుభ రత్నము 

కోరస్ 

భక్తి రస వాహిని!ఇది 
అవనిలో జనులను 
పునీతులను చేసేటి 
అమృతోపమమ్మైన ఝరి! 

Views (101) 

No comments:

Post a Comment