Thursday, April 23, 2009

కళా గృహం


కళా గృహం
(పల్లవి) 
''''''''''''''''''''' 
1) మంజుల నాదం - మురళీ గానం 
కళలకు లాలిత్య - ఆధార వేదం 

(అను పల్లవి) ;;;;; 
'''''''''''''''''''''''''''''''''''' 
పద్మ లోచనా! లోక మోహనా! 
నంద నందనా! - వందనము //పద్మ // 

2) చిటికెల తాళం , చిడతల తాళం 
చిందులు ఆయెను నాట్యాలు 
నటనల కిటనే దొరికిందీ 
చక్కని ఆవాసం - 
నళినీ శత దళ నివాసము // 

3) కోలాటాల లయలలలోన 
కిట కిట హొయలులు 
చిటి చిటి సడిలో - నటనల కిటనే 
దొరికెను చక్కని ఆవాసం 
కోమల కువలయ నివాసము // 

4) ఈలల గీతం , ఈ సంగీతం 
గళముల సౌరుగ "జాన పదం" 
వీనుల విందౌ , గాన ఝరుల కిట 
దొరికెను చక్కని ఆవాసం - 
పూ భవంతీ నివాసము
/ /
Views (101)

No comments:

Post a Comment