హృది సప్తగిరి
శ్రీ ఆదిశేష వలయాలు శ్రీ కారము చుట్టలాయె! ( అను పల్లవి); పాల కడలి తెలి నురుగులు ప్రారంభ శుభద పద్యమ్ములాయేను శ్రీ వేంకటేశ్వర స్వామి, కొలువైన ప్రతి హృది స్వర్ణ మయపు సప్త గిరి // 1) నింపాదిగ ఎగిరి వచ్చు గరుత్మంతు పక్షమ్ముల వాలు ఈకలందు దూరె ప్రభా కిరణ చంద్రికలు ఇందున, ఇందిందున "సూర్య కిరణ " చమత్కృతులు ఇందే,ఇందిందే "ఇందు కాంతి" యతి, ప్రాసల శుభ శీతల చందనములు // 2)మలయ పవన వీచికల సుతి మెత్తని ప్రతి కదలిక "ఇతి హాస కావ్య సంరంభము" అలర్మేలు మంగ పతి! స్వామీ! నీ అనుగ్రహ మది ఏమది? (*!) నా "మది మందిర ప్రబంధ"మిది, మీది! ( *2 ) ఇందిరా మనో హర! అందుకొనుమా "ప్రణతులను". (*3) // ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; *1)అనుగ్రహము, అది ఏమది!= చాలా గొప్ప ఆదరణము. నీ అనుగ్రహము ఉన్న 'మది'యే కదా,నిజమైన మది.* *2) ఈ మది 'పూజా మందిరము'./ మది ప్రబంధ బంధురమైనది./ మంగమ్మకూ, నీకే ఈ హృదయ కావ్యము అంకితము. *3) అందుకొనుమోయీ!మా నమస్సులు / అందుకో! మా యొక్క ప్రణతులు. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, |
Views (111) | |
No comments:
Post a Comment