Saturday, April 18, 2009

మృదు వీవన

'''''''''''


పోతనామాత్యుని పద్య రత్నములు ;;;;;;
'''''''''
1)క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు,సైకత ;
శ్రోణికి చం(జం)చరీక చయ సుందర వేణికి,రక్షితామర ;
శ్రేణికి (దోయ)తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్ష దామ శుక వారిజ,పుస్తక, రమ్య పాణికిన్

2)శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా ;
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద,మం ; 
దార సుధా పయోధి సిత తామరసామరవాహినీ ,శుభా ; 
కారత నొప్ప నిన్ను మదిగానగ నెన్నడు గల్గు భారతీ!.

3)అంబ నవాంబుజోజ్జ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా ;
డంబర చారు మూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా ;
చుంబిత దిగ్విభాగ శ్రుతి సూక్తి వివిక్త నిజ ప్రభావ ,భ ;
వాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృప చూడు భారతీ!.

No comments:

Post a Comment