కోలాటం వేయండీ!
కోలు! కోలు! కోలాటం వేయండీ! //కోలు // కోటి సొగసుల ప్రోవు ,సప్తాద్రి వాసునీ శ్రీ వేంకటేశునీ ,తనివార నుతియిస్తు కోలాటము వేస్తేను ఆరాటము తీరునుగా! // 1)మేదినిలో నెలకొనిన -అందాల రాయుడు గోవిందుడు! శ్రీ గోవిందుడు! మన కొసగెను "గోవిందా!" అను నామమును ఏడు కొండల వాడు! కరుణా మయుడితడే! // 2)ప్రతి మదిలో కొలువాయెను ,నీదు రూపము ప్రతి పెదవిని నీదు'పదము'తొణికిస లాడేను మది, పెదవులు కోవెలలుగ తనరు చుండె నిపుడు! సప్త గిరుల స్వామీ! భక్త మందారా! // |
Views (93) |
No comments:
Post a Comment