Friday, July 31, 2015

నరునికి మాతామహి

 బందరు కోతి!  బందరు కోతి!  
] బందరు కోతి!బందరు కోతి!
ఎక్కడి నుండి వచ్చితివి?
ఏందీ నీ కథ, కొంచెం చెపుమీ! ||

బందరు కోతికి కోపం వచ్చి, 
మూతి ముడుచుకుని కూర్చుంది:
అసలే మూతి కొంచెం వక్రం; ఆపై 
ఇంతటి అలుకా! రామ్ రామ్! ||

"రామ్!రామ్!"రామ శబ్దమును వినగానే; 
అలుక, కినుకలు మటుమాయం!
చటుకున వచ్చి వద్దకు చేరీ, 
మొదలెట్టింది బాతాఖానీ, మాట కచేరీ! 

చెట్టులు ఎక్కీ; కొమ్మలు దుమికీ; 
ఆకుల మాటున నక్కినది; 
ఆటలు ఎన్నో ఆడింది! 

మనకు నేర్పినది "కోతి కొమ్మచ్చి" 
నరునికి స్వయాన 'మాతామహీ!||

 చెట్ల ఊడలను పట్టుకు 
దూకుచు, దుముకుచు, దేకుచు, 
గంతులు వేయుచు కోతి చేరెను 

తిరుమల కొండలు; 
దర్శించుకొనెను శ్రీ బాలాజీని! 
"గోవిందా! శ్రీ గోవిందా!" అని 
నామ జపమును చేసినది  ||

తిరుమల లడ్డూ, వడ ప్రసాదం 
కొంచెం భాగం తినెను వానరం
తక్కిన స్వీటును తక్కినవారికి  
పంచి ఇచ్చెను మిగుల ప్రేమతో! ||

======================

మనకు నేర్పినది "కోతి కొమ్మచ్చి"
నరునికి స్వయాన 'మాతామహీ!||




Thursday, July 30, 2015

మేలిముసుగు సుందరి

మేలిముసుగులోనికి ; 
ఎనలేని సౌందర్యము ; 
పోతపోసినారెవ్వరో!?||
  ఎవ్వరే అందాలరాశి? 
  ఎవరే? ఇంకెవరే? – 
     || ఇంకెరు ఔతారు, 
       ఆమె మా రాధమ్మ!||

        నీల నీలి యమునా వాహినిలో
  నల్లా నల్లని నీట సాగేను పడవ; 


  హైలెస్స ఎత్తుగా తెరచాప - 
        ఆ అవస్తారముల; 
          వెనుక నిలబడి; 
                 తొంగిచూచునది ఎవరమ్మా? 
     || ఇంకెరు ఔతారు, 
       ఆమె మా రాధమ్మ!||

        ఎవ్వరే లావణ్య వారాశి? 
             ఎవ్వరే ఆ అందాలరాశి? 
  అట ఎవరమ్మా? 
            ఏమి ఆ వివరము? 
        || ఇంకెరు ఔతారు, 
                ఆమె మా రాధమ్మ!||

  మెరుపులను మోసేటి మేఘముల పోలిక;
  పరదాలు అందాలరాశి మూటలాయేను; 
              కరదీపిక వేరుగా; కావాలా ఏమిటి?
              ఆ నిండుచందమామను 
                   మన కన్నుల నింపుకొనగ! || 

****************************************

    Total Pageviews  ; Sparkline 32,260

Sunday, July 26, 2015

కదంబతరువున ఏనుగు బొమ్మ

దూర్వాసమున్ని పరమేశుని పూజించిన 
ప్రసాద ఫలమైన పుష్పహారాన్ని దేవేంద్రునికి ఇచ్చాడు. 
ఐరావతమునెక్కి ఉన్న దేవేంద్రుడు నిర్లక్ష్యుడౌతూ, 
ఆ దండని ఏనుగుకు ఇచ్చాడు. 
ఐరావతం దానిని తొండముతో విసిరింది. 
దుర్వాసముని కోపానికి గురైన ఇంద్రుడు 
స్వయంభూ ఐరావతేశ్వరస్వామిని పూజించి, శాపవిముక్తుడు ఐనాడు.
ఇంద్రుని వాహనమైన ఐరావతమునకు కూడా శాపవిముక్తి కలిగింది.  
అందువలన కదంబ వృక్షము (యొక్క చెక్క)లో 
ఐరావత స్వరూపమున గుడిలో వెలసినది.
శ్రీలక్ష్మీదేవి సోదరి జ్యేష్ఠాదేవి.ఆమె కుమారుడు రిషభుడు, 
కుమార్తె   అగ్నిమధ / మాత. 
(Rishaban and daughter Agnimadha).
మధురై వద్ద "ఐరావతీశ్వర కోవెల" లో వీరి విగ్రహాలు ఉన్నవి. 

***********************************

ఐరావతీశ్వరర్ కోవెల; ఆనయూర్ పట్టణము, ] తిరు అగ్నీశ్వరం -  ప్రాచీన నామము ; 
మూలదేవులు: /; అగ్నీశ్వరన్ ఉదయ ;
స్థల వృక్షం "బిల్వము / మారేడుచెట్టు.   
***********************************

SrIlakshmIdEwi sOdari jyEshThAdEwi.aame kumaaruDu rishabhuDu, kumaarte   agnimadha(#Rishaban and daughter Agnimadha#).
madhurai wadda "airaawatiiSwara kOwela" lO wiiri wigrahaalu unnawi. 
duurwaasamunni paramESuni puujimchina prasaada phalamaina pushpahaaraanni dEwEmdruniki ichchADu. airaawatamunekki unna dEwEmdruDu nirlakshyuDautuu, aa damDani Enuguku ichchaaDu. airaawatam daanini tomDamutO wisirimdi. durwaasamuni kOpaaniki guraina imdruDu swayam bhuu airaawatESwaraswaamini puujimchi, SApawimuktuDu ainaaDu.  

**************************************

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 60092 pageviews - 1020 posts, last published on Jul 24, 2015 - 7 followers
అఖిలవనిత
Pageview chart 32169 pageviews - 790 posts, last published on Jul 23, 2015
Telugu Ratna Malika
Pageview chart 4504 pageviews - 127 posts, last published on Jun 22, 2015

Thursday, July 23, 2015

మృదులభాషిణీ! భక్త కల్పవల్లీ!


శ్రీ కర- శ్రీ యుత- శ్రీ పరిపూర్ణా! 
శ్రీ రవళీకృత మృదులభాషిణీ! భక్త కల్పవల్లీ! 
మా పూజలు గైకొనవమ్మా! జననీ!   || శ్రీ కర || 

సురుచిర హాసిని! వీణా రవళీ వినోదినీ! 
లావణ్య మోదినీ! భావకారిణీ! 
అతులిత రాగ విహారిణీ! దేవీ!   || శ్రీ కర ||

అంబా శాంభవి! జ్యోత్స్నా భాసిని!                   
సౌందర్యాలయ మూర్తీ! జననీ!
కరుణా వీక్షణ తేజోభాసిని! దేవీ!   || శ్రీ కర || 

***********************************

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 59944 pageviews - 1019 posts, last published on Jun 29, 2015 - 7 followers

అఖిలవనిత
Pageview chart 32117 pageviews - 789 posts, last published on Jun 28, 2015

Telugu Ratna Malika
Pageview chart 4501 pageviews - 127 posts, last published on Jun 22, 2015 

Sunday, June 28, 2015

కీలు గుర్రం

చీకటి బూచీ! ఛల్ ఛల్ ఛల్!; 
వేకువ మాతా! హల్ చల్ చల్! ||
పుడమి రాణికీ టింగణా గుర్రం; 
ఛల్ ఛల్  ఛల్  ఛల్ ఛల్  ఛల్ 
ఛల్ ఛల్  ఛల్  చలాకి గుఱ్ఱం ॥ 

పంచ కళ్యాణీ ఛల్ ఛల్ ఛల్! 
బాలపాపలకు కీలుగుర్రము 
మారాం పిల్లకు కొయ్యగుర్రము
మంచి పాపలకు రెక్కలగుఱ్ఱము
ఛల్ ఛల్  ఛల్  ఛల్ ఛల్  ఛల్   || 

మారాం చేయకు పాపాయీ!
మారాం, హఠములు మానేస్తే; 

నీకూ దొరుకును జవనాశ్వం - గుఱ్ఱం
ఛల్ ఛల్  ఛల్  ఛల్ ఛల్  ఛల్   || 
====================

 kIlugu~r~ram / 
          kiilu gurram :-

chiikaTi bUchI! Cal Cal Cal!; 
wEkuwa mAtA! hal chal chal!
puDami raaNikI TimgaNA gurram; 
Cal Cal  Cal  Cal Cal  Cal  
Cal Cal  Cal  chalaaki gurram; ||

pamcha kaLyaaNI Cal Cal Cal! 
baalapaapalaku kiilugurramu; 
maaraam pillaku koyyagurramu;
mamchi paapalaku rekkalagurram;
Cal Cal  Cal  Cal Cal  Cal   ||

maaraam chEyaku paapaayI!
maaraam, haThamulu maanEstE; 

nIkU dorukunu jawanaaSwam - gu~r~ram (= ఱ్ఱం)
Cal Cal  Cal  Cal Cal  Cal   
Cal Cal  Cal  Cal Cal  Cal   ||

*************************
పిల్లలు కట్టే గుజ్జన గూళ్ళు july 28 wednesday 2010;

సంతోషమ్మే సగము బలమురా! 

ఏ ముని తపస్సు చెదిరినదో?

వియత్తలిని పాదముతో:     
కొలిచినాడు క్రిష్ణుడు, 
మన చిన్నారి  క్రిష్ణుడు! ||

ఏ ముని తపస్సు చెదిరినదో? 
ఏ బ్రహ్మర్షి - 
ధ్యానమ్ము భంగమయ్యినదో!?; 
చిటికెలోన 
దేవకీ- గర్భమ్మున దూరినాడు
అయ్యారే! క్రిష్ణుడు! 
మన చిన్నిక్రిష్ణుడు   || 

అమూల్యమణుల గని ఈతడు; 
సువర్ణ ప్రభల నిలయము; 
మన ధరణికి -
తేజస్సుల వరమయ్యెను, 
అయ్యారే! క్రిష్ణుడు! 
మన చిన్నిక్రిష్ణుడు  ||

ఎంతగా స్తుతించినా; 
ఎంతని వర్ణించినా; 
ఏమని వివరించినా: 
తనివితీరదే! తనివితీరదే!
మన చిన్నిక్రిష్ణుని/ డు 
॥ అయ్యారే! క్రిష్ణుడు! 
మన చిన్నిక్రిష్ణుడు ॥   
===================
 
wiyattalini paadamutO: 
kolichinaaDu krishNuDu, 
mana chinnaari  krishNuDu||

E muni tapassu chedirinadO? 
brahmarshi dhyaanammu 
bhamgamayyinadO!?; 
chiTikelOna 
dEwakii garbhammuna duurinaaDu 
ayyaarE! krishNuDu; 
mana chinni krishNuDu || || 

amuulya maNula gani iitaDu; 
suwarNa prabhala nilayamu; 
mana dharaNiki; 
tEjassula waramayyenu, 
ayyaarE! krishNuDu; 
mana chinni krishNuDu ||

emtagaa stutimchinaa; 
emtani warNimchinaa; 
Emani wiwarimchinA: 
taniwitiiradE! taniwitiiradE! 
mana chinnikrishNuni/ Du 
ayyaarE! krishNuDu; 
mana chinni krishNuDu || 
 
***********************************
అఖిలవనిత
Pageview chart 31658 pageviews - 786 posts, last published on Jun 16, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 59103 pageviews - 1018 posts, last published on Jun 24, 2015 - 7 followers
Telugu Ratna Malika
Pageview chart 4424 pageviews - 127 posts, last published on Jun 22, 2015
 

Tuesday, June 16, 2015

బొడ్రాయి = నాభిశిల

వాస్తు శాస్త్రంలో నాభిశిల (नाभि (शिला) కు ప్రాధాన్యత ఉన్నది.
నాభి సంస్కృత పదానికి - బొడ్డు  అని అర్ధం. 
"బొడ్రాయి" అని తెలుగు పదం. చాలాగ్రామాలలో, బొడ్రాయి అనే మాటను, 
నేడు కూడా వాడుతున్నారు.
గర్భవతికి, కడుపులోని బిడ్డకూ అనుబంధంగా బొడ్డుత్రాడు ఉంటుంది.
నాభి - ప్రాణసంకేతం.
శంకుస్థాపన, గృహ ప్రవేశ వేళలలో, నాభిశిల స్థాపన ముఖ్య పరిశీలన అంశం. .
కేతేపల్లి (సువర్ణగిరి - ఈ పల్లెకు ప్రాచీన నామం. - నల్గొండ జిల్లా), 
బోగారం మొదలైన గ్రామాలలో
గ్రామదేవత పండుగగా స్థానికంగా అనేక పల్లెలందున పండుగను జరుపుకుంటారు.
"బొడ్రాయి పండుగ" ను తెలంగాణా ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు.
కుమార్తెలను పుట్టినింటికి పిలుస్తారు. కూతుళ్ళకు కానుకలను ఇస్తారు.
శాఖాహారాది సూత్రాలను పట్టింపుగా అనుసరిస్తారు.
నాభి శిల ; శ్రీపర్ణి వాస్తు శాస్త్రాదులందు వాస్తు రీత్యా,
 "జీవికి నాభి వలె, కోవెలలు, భవన, గృహ నిర్మాణాదులందు 
నాభిశిల గురించి ప్రస్తావన చేస్తారు.
శ్రీకూర్మ శిల, మత్స్య యంత్రం మొదలగు యంత్రములు సైతం 
అనుబంధంగా విశిష్ట స్థానాన్ని కలిగిఉన్నవి.

******************************

నేపాల్ లోని కాళీగండకీ నది సాలగ్రామములకు ప్రసిద్ధి.
గండకీ నదిలోని సాలగ్రామములు, కూర్మశిలలు ప్రకృతిసిద్ధమైనవి.
శ్రీ మహావిష్ణు మూర్తికి ప్రీతిపాత్రమైనవి సాలగ్రామములు.
నేపాల్ దేశంలో గండకీ నదీ తీరమున విష్ణుమూర్తికి ప్రతిరూపముగా
"సాలిగ్రామ్" అని ఒక గ్రామము ఉన్నది.
సాలంకాయన మహర్షి ఒక పర్ణశాలలో నివసిస్తూ,
శ్రీ మహావిష్ణువును 'వనరూపి విష్ణువు' రూపమున 
సాలవృక్షమున పూజలు చేసాడు. 

******************************

అప్పటి నుండి ఆ కుగ్రామానికి 'సాలగామ్' అనే నామం వచ్చినది.  

శ్రీ వైష్ణవులు కఠిన నిష్ఠతో సాలగ్రామమును 
పూజామందిరములలో ఉంచి, ఆరాధిస్తూ ఉంటారు.
వరాహపురాణము, స్కందపురాణము, ఆపస్తంబుడు విధించిన సూత్రములు, 
తులసీ కథ, సాలగ్రామ భావన యొక్క ప్రాచీనతకు ఋజువులు. 
క్రీస్తు పూర్వము నాటిది ఈ "సాలగ్రామ పూజ".
"ఆది విష్ణు పంచాయతనము" విశిష్టత కలిగిన పూజా విధానం.

******************************


 clouds  










అఖిలవనిత
Pageview chart 31399 pageviews - 785 posts, last published on Jun 12, 2015 - 1 comment awaiting moderation
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 58763 pageviews - 1017 posts, last published on May 2, 2015 - 7 followers
Create new postGo to post listView blog
Telugu Ratna Malika
Pageview chart 4387 pageviews - 126 posts, last published on Jan 14, 2015

Friday, June 12, 2015

ధ్వని - అధిష్ఠాన దేవతలు

జగత్ జననీ! వాక్కులు జాలువారుటకు నీవు మూలస్థానమువు. 
చంద్రకాంతి మణుల పభలు కలిగిన ఆ రజను, తెల్లనిది, 
వశిన్యాది శక్తులు కలిగినవి నీ వాక్కులు. 
అటువంటి వాక్ శక్తి కలిగిన నిన్ను పూజించిన మానవుడు - 
రచనా సమర్ధుడగును, 
అతడు సరస్వతీ ముఖపద్మమునందలి 
పరిమళ యుక్త వాక్కులతో కూడిన 
కావ్యాలను రచించగలుగుతున్నాడు. 
                 -   (సౌందర్యలహరి, 3 వ శ్లోకము) :   
తాత్పర్య:- త్రిపురాంతికా దేవి - "మాతృకా వర్ణరూపిణి" అనీ, 
"పంచాశత్పీఠికా రూపిణి" అనీ - లలితాసహస్రనామములందు కీర్తించ బడినది.
పై శ్లోకమునందు వశిన్యాది దేవతలు:- ఎనిమిది మంది.
1. వశిని; 2. కామేశ్వరి; 
3. మోదిని; 4. విమల; 
5. అరుణ; 6. జయిని; 
7. సర్వేశ్వరి; 8. కౌళిని

'శ్రీ చక్రము 'నందలి 7 వ ఆవరణములోని 8 కోణములలో ఉంటారు. 
[సన్స్కృత పదజాలము - పునాదిగా - 
వ్యాకరణ పరిపుష్ఠ సిద్ధాంతములు నిర్మితమైనవి. 
50 అక్షరములు; 8 వర్గములుగా విభజించబడునవి. 
వానికి ఈ ఎనిమిదిమంది అధిష్ఠాన దేవతలు, 
వశిన్యాది దేవతలు 
ఉదాహరణకు - 'అచ్చులు ' ఒక వర్గముగా విభజితమైనవి. 
ఈ అచ్చులకు వర్గాధిదేవత - "వశిని".
1) క చ ట త ప వర్గాధి దేవతలు ఐదుగురు.
2) అంతస్థములు ; 3) ఊష్మములు -
ఈ రీతిగా అష్ట వాగ్దేవతలు "మానవులు ఉచ్చరించు శబ్దములు" కు ప్రేరణ ఐనారు. 
ధ్వనుల ఉచ్ఛారణలకు మూలస్తంభములు - వాగ్దేవతలు, 
కనుక వీరు శక్తి స్వరూపిణులు.
ఇట్టి శక్తివంతములైన వాక్కులు, అందలి భావములు, 
అటువంటి మాటలను పలుకవలెనను సంకల్పబలం, 
ఉద్దేశ్యాలకు కేంద్రబిందువు "అమ్మవారు".  
అందుచేతనే వాగ్దేవతలు ఆరాధిస్తున్న త్రిపురాంబికనూ, 
అమ్మవారినీ సేవించి తరించగలము.  
అద్భుత సౌగంధయుత కవిత్వమును అందించిన 
కాళిదాసాదులు, రసహీనమైన వేదాంత సారాంశాన్ని  కూడా సురభిళభరితమొనర్చిన శ్రీ ఆదిశంకరాచార్యుల ప్రతి రచన - 
ఇందుకు ఉపబలకములే కదా! 
శ్రీ శారదా దేవి - వాగ్దేవతల సంయుక్త రూపము.  
సారస్వతస్వరూపిణి ఐన శ్రీవాణీ దేవి వదనకమలము నుండి 
వెలువడు పరిమళము దైవికమైనది. 
ఆ సారస్వత, మాతృ స్వరూపిణి ప్రసాదము - 
మాధుర్య కవిత్వములు. 
మధురిమలు రంగరించ బడిన కావ్య సృజనలను - 
అమ్మవారి అనుగ్రహము - అని గ్రహించుట 
కవి యొక్క విద్యుక్త ధర్మము.

 roof design POP 

           






 - { రచన :  కోణమానిని - కుసుమ  
                   konamanini - kusuma )

Thursday, June 11, 2015

Camel భారీ

ఒంటె, ఊష్ట్రం,  ఎడారి ఓడ; 
పంచతంత్రమున కరభకము 
ఆంగ్ల భాషలో camel అందురు  
చదరంగంలో వయ్యారి పాను;  

కన్నురెప్పలు మూడు చొప్పున; 
ఆరు కలిగిన వింత జంతువిది;

మూపున నీళ్ళ ఫ్రిజ్ దాచుకుని
ఎండనుబడి తానెన్ని మైళ్ళు, క్రోసులు
యోజన దూరాల్ అలసట లేక నడవగలుగును

ఒంటె సవారీ బలే హుషారు
నేను ఇచ్చిన నీళ్ళను త్రాగి 
తుమ్ములు వచ్చెను కేమెల్ గారికి.
హాచ హాచ్ హాఛ్! ...... 












౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦
రచన : కోణమానిని 
rachana : kONamaanini 


అఖిలవనిత
Pageview chart 31269 pageviews - 783 posts, last published on Feb 23, 2015 - 1 comment awaiting moderation
Create new postGo to post listView blog
Telugu Ratna Malika
Pageview chart 4372 pageviews - 126 posts, last published on Jan 14, 2015 
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 58662 pageviews - 1017 posts, last published on May 2, 2015 - 7 followers
Create new postGo to post listView blog

Monday, February 23, 2015

అచ్చులతో అచ్చమైన పద్దెం

న్నవరం స్వామికి దండం పెట్టి;
మ్మవారి వద్ద అన్ని వరాలను కోరి;
హారం తీసుకుని ఆ రత్నగిరి పైని;
ముదాలవలసలోన ముదము కొన్నారు;
వ్వాళ పట్టుదలతొ ఇంగ్లీషు నేర్చుకునిరి
మనిలో వీణ నేర్చి,
           ఈలలు వేసారందరు, ఎంతో సంతోషంతో;
న్నవలో నవల చదివి,
           ఉట్టి కొట్టు పండుగలో హుషారుగా పాల్గొని;
టుకూరు టబావి కడ దాహాన్ని తీర్చుకుని,
షికొండను ఎక్కేసి, గ్రీష్మ ఋతువులోన సేదదీరినారు;
ఱ్ఱ ట్రామును ఎక్కి; లుక, నుగును చూసి ;
కంగా భై డు బొమ్మలు - కొన్నారు అందరూ;
ఆ చిత్రములన్నింటా - చక్కని శ్వర్యా బచన్:
ఒంటెను, డలను ఎక్కి ప్రయాణీకులు చప్పటు కొట్టారు
హోహో! అంటూను తెగ సర్ ప్రైజు ఐనారు;
అంతు లేని ఆశ్చర్యం, ఈ జగతి దర్శనమ్ములు!
అంతకు వెయ్యింతలు ఇలలోన ఈ ప్రకృతి;
సృష్టి వీక్షణములు కన్నులకు అనుగ్రహములు!
అంతే! అంతే అంతే! అంతే కదా! మరి, ఒప్పుకుని తీరాలి!
అచ్చులను హత్తుకున్న బాల గీతిక:
అల్లరితో ముద్దుగా నేర్చుకోండి పిల్లలు!
అచ్చుల సందడితో ఆటలు భలే పసందు!

(అచ్చుల సందడి; అచ్చులతో అచ్చు వేసుకున్న పద్దెం; 
అచ్చులతో అచ్చమైన పద్దెం; అచ్చులను హత్తుకున్న బాల గీతిక)

  *****************

annawaram swaamiki damDam peTTi; 
ammawaari wadda anni waraalanu kOri; ;
aahaaram tiisukuni aa ratnagiri paini; 
aamudaalawalasalOna aamudamu konnaaru; 
imgliishu nErchukuni, imguwa Dabbaanu techche; 
iimanilO wiiNa nErchi, 
           Ilalu wEsaaramdaru, emtO samtOshamtO; 
unnawalO nawala chadiwi, 
uTTi koTTu pamDugalO hushaarugaa paalgoni;
uuTukuuru uuTabaawi kaDa daahaanni tiirchukuni, 
            griishma RtuwulOna , 
RshikomDanu ekkEsi, sEdadiirinaaru;  
e~r~ra Traamunu/ bassunu ekki; 
eluka, Enugunu chuusaari/ sEsi ;  
EkamgA Ebhai EDu bommalu ; 
konaaru amdaruu; aa chitramulannimTaa - 
           chakkani aiSwaryaa bachan: 
oka omTe, ODalanu ekki, prayaaNIkulu 
 chappaTu koTTAru, 
OhOhO! amTUnu tega sar praiju ainaaru; 
amtu lEni AScharyam, ii jagati darSanammulu
amtaku weyyimtalu sRshTi weexaNamulu
amtE! amtE amtE! 
amtE kadaa! mari oppukuni tiiraali! 
=
achchulatO achchulanu hattukunna baala giitika:
allaritO muddugaa nErchukOMDi pillallalu!  

achchula samdaDitO ATalu bhalE pasamdu!  

{achchula samdaDi; achchulato ATalu;
  achchulanu hattukunna baala giitika:
achchulato achchumaina padyaalu}

*****************  10:42 AM 2/23/2015


కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56696 pageviews - 1014 posts, last published on Feb 21, 2015 - 6 followers
అఖిలవనిత
Pageview chart 30301 pageviews - 777 posts, last published on Feb 21, 2015

Saturday, February 21, 2015

వెన్నెల రధము సరుకులు

చల్లని వెన్నెల రధము వచ్చింది; 
           వచ్చిందీ వచ్చింది; 
అందున్నవి వస్తువులు 
చాలా చాలా! చాలా చాలా! || 

రధ సారధి ఎవ్వరు? అందాల జాబిల్లి; 
జాబిల్లి చేతికి మెరుపుల పగ్గాలిచ్చి, 
త్వరపరచండీ త్వరపరచండీ;  ||
ప్రశ్న:-  
అందున్న సరుకుల పట్టిక వివరించండీ!
జవాబు:-  
యమునా జలముల సవ్వడి; 
ఆ నీళ్ళ తుంపురుల స్నానాలాడేటి గాలి ||

వంశీకృష్ణుడు; మనకు 
వినిపించే వేణు రవళి: 

మురళీ గానమ్ముల, గ్రోలు 
జనుల మైమరుపులు || 

***********************************
[వెన్నెల రధము సరుకులు ] 
 window curtain designs 













కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56618 pageviews - 1013 posts, last published on Feb 20, 2015 - 6 followers
అఖిలవనిత
Pageview chart 30267 pageviews - 776 posts, last published on Feb 19, 2015

Thursday, February 19, 2015

రష్యా ఆఫ్గనిస్థాన్ బార్డర్ లలో హిందూ ప్రాచీనత

శ్రీకృష్ణుడు పురాణపురుషుడు, ప్రజల అభిమానాన్ని సంపాదించి,  
దైవస్థానాన్ని పొందిన అద్భుత  వ్యక్తి. !!!!!
శ్రీకృష్ణుని ప్రాచీనతనునిరూపించే ఆధారాలు అనేకం దొరికాయి. 
ఆ ఆధారాలను కనుగొని, వెల్లడించినది విదేశీయులే అవడము 
చెప్పుకోదగిన విశేషమే!
*******************************: 

ఆఫ్ఘనిస్తాన్, సోవియెట్ రష్యాసరిహద్దులలో  "ఐ-ఖనం" అనే 
ప్రదేశములో అన్వేషణ జరిపారు.
ఆ సర్వేను చేసిన పరిశోధకుడు "పి.బెర్నార్డ్ "
ఫ్రెంచ్ ఆర్కియలాజికల్ అన్వేషకులు
(P. Bernard and a French archeological Expedition)   
"భరతవర్షములో శ్రీకృష్ణ ఆరాధన ఎంత ప్రాచీనమైనది? " 
అనే అంశము వారిని ఆకర్షించినది.     
సర్ విల్లియం జోన్స్  (sir william Jones) అధ్యనములు మున్నగునవి
భగవంతునిగా సుప్రతిష్ఠుడు ఐనట్టి
"శ్రీకృష్ణుడు- అత్యంత ప్రాచీనకాలము నాటి వాడు"- అని 
3-4 శతాబ్దములనాటి క్రీస్తుపూర్వ నాణెముల ముద్రలు - ఋజువు చేస్తూన్నవి.
ఆఇ-ఖనుం వద్ద ఆరు కంచు నాణెములు త్రవ్వకములలో లభించినవి.
ఆ రెక్టాంగులర్ కాయిన్లు 180-165 బి.సి. నాటివి అని బోధపడినది.  
(Indo-Greek ruler Agadhochles (180?-165 BC).  
దీర్ఘ చతురశ్రముగా ఉన్న 6 కంచు (బ్రొంజె) కాయిన్స్ లభ్యమైనవి.  
అవి అగాథాక్ల్స్ - అనే ఇండో గ్రీకు పాలకుడు జారీ చేసిన
దీర్ఘ చతురశ్రముగా ఉన్న 6 కంచు (bronze) కాయిన్స్
(six rectangular bronj coins (180-165 BC)  గొప్ప చారిత్రక సంపద.
ఆ ఆరు నాణెములపైన గ్రీకు, బ్రాహ్మీ అక్షరములు కలవు.
ఆ రెండు భాషల లిపితోపాటుగా విష్ణుమూర్తి/ వాసుదేవ బొమ్మ ఉన్నది.
ఆ ప్రతిమ హస్తములలో చక్రము, శంఖము ఆకారపు వస్తువు ఉన్నవి.
వైష్ణవ మతములో ఆరాధించే "శ్రీ విష్ణుమూర్తి"  శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించును.
వీనిలోని రెండు చిహ్నములు- ఐన శంఖ, చక్రముల ధారణ-  వలననే
'ఈ బొమ్మ విష్ణువుది!'- అనే అభిప్రాయానికి ప్రత్యక్షనిదర్శనము.
అక్కడ దొరికిన మరో - "అగాధో క్లిస్- కాయిన్" పైన
"హలమును ఎత్తి పట్టినట్టి బలరామదేవుని చిత్రము,
అలాగే పరమేశుడు, దుర్గాదేవి, కుషాణ ప్రభువైన రెండవ కనిష్క చక్రవర్తి బొమ్మ,
3-4 శతాబ్దములనాటి కాయిన్- బ్రహ్మదేవుని వదనము కలది - 
చారిత్రక శోధనకు అమూల్యముగా దొరికినవి.
*******************************: 

దర్గా పీర్ రత్తన్ నాథ్- కాబూలులో ఒక విగ్రహము ఉన్నది.
ఆ పాలరాతి బొమ్మ పీఠముపై ఇలాగ రాసి ఉన్నది.
"మహా వినాయకుని ఘన సుందర మూర్తి"- అని 
పీఠముపైన చెక్కబడి ఉన్న ఆ మార్బుల్ ప్రతిమను 
"షాహి రాజా ఖింగలుడు" ప్రతిష్ఠితమొనర్చెను.
ఆఫ్ఘనిస్తాన్ లో 5వ శతాబ్దికి చెందిన ఈ బొమ్మ గర్దెజ్ అనే చోట లభించినది.

*******************************: 
{పురాణపురుషుడు శ్రీకృష్ణుడు}
 Fort Wall design 














ఆధారములు :- 
శ్రీ కృష్ణ  image of Vishnu, or Vasudeva, carrying a Chakra,
a pear-shaped vase/ conchshell,                                    
 Indo-Greek ruler Agathocles (180?-?165B.C.).
(six rectangular bronze coins issued by the Indo-Greek ruler
పురాణపురుషుడు శ్రీకృష్ణుడు

అఖిలవనిత
Pageview chart 30181 pageviews - 776 posts, last published on Feb 18, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56502 pageviews - 1011 posts, last published on Feb 16, 2015 - 6 followers