Wednesday, July 27, 2016

మేల్కొలుపులు

రేపల్లె నుండి విచ్చేసిరి ఆబాలగోపాలమంతా! 
కృష్ణుడున్న చోటే కద ; సందడులకు మారుపేరు   ||
;
పాలబువ్వ మూటలన్ని చెట్టు కొమ్మలకు కట్టి ; 
అట్టిట్టు ఆడుకొనుచు ; అలసిసొలసి  ఆ పిల్లలు ; 
యమునానదిలోన ఒడలు బాగ కడుగుకొనీ చేరిరి ; 
                                           తీరికగా చెట్టు దరికి  ||
;
బాలకృష్ణుడిట్టిట్టే గబ గబ గబ; ఆ చెట్టెక్కి, 
చిట్టి చేతులను చాచి, అందుకుని, 
చద్దిమూటలను చంక నెట్టి దిగినాడు , 
చులాగ్గా, బహు చలాకిగా  || 
;
చిన్నిబాలకృష్ణయ్య హస్తస్పర్శ సోకగనే : 
ఆ ద్రుమము పులకించెను ;
వనభోజన వినోదాలు- 
జడ ప్రకృతికి మేల్కొలుపులు ; 
నాటినుండి ఆ శాల్మలి - 
కాయలెన్నొ కాయసాగె! 
ఆ బూరుగు ఫలము లచ్చు 
చద్దిఊటలకు మల్లే ఉండు 
విచిత్రం కన్నారా?!!!  ||  
;
 మేల్కొలుపులు ;- [పేజీ 48 - పాట 42 ] ;- 
కృష్ణ ; కృష్ణుడున్న చోటే కద ; సందడులకు మారుపేరు 

=========================== ,

paalabuwwa mUTalanni 
cheTTu kommalaku kaTTi ; 
aTTiTTu ADukonuchu ; alasisolasi  
aa pillalu ; yamunaanadilOna 
oDalu baaga kaDugukonia chEriri ; 
teerikagaa cheTTu dariki  ||
;
baalaకృష్ణుDiTTiTTE gaba gaba gaba; 
A cheTTekki, chiTTi chEtulanu chaachi, amdukuni, 
chaddimUTalu ; chamka neTTi diginADu , 
chulAggA, bahu chalaakigaa  || 
;
chinnibaalaకృష్ణyya hastasparSa sOkaganE : 
aa drumamu pulakimchenu ;
wanaBOjana winOdAlu- 
jaDa prakRtiki mElkolupulu ; 
nATinumDi aa SAlmali - 
kaayalenno kaayasaage! 
aa buurugu phalamu lachchu 
chaddiUTalaku mallE umDu 
wichitram kannAraa?!!!  || 

शाल्मली  शाल्मली शाल्मली शाल्मली शाल्मली शाल्मली 
शाल्मली / శాల్మలి = " silk-cotten tree" in Sanskrit.
;
ళఌౡ ళళఌౡ ళళఌౡ ళ **************,

Monday, July 18, 2016

పరమపద సోపాన క్రీడలలో మేటి

పరమపద సోపాన క్రీడలందున - 
నిచ్చెనలు ఎక్కుటలొ నీకు నీవే సాటి; 
బేలలము నీదు భక్తులము ఎల్లరము! ; 
ఇక పైన 
మాకన్ని నేర్పుట - నీ వంతు! 
నీదు చిత్తము, మాదు భాగ్యాలు కన్నయ్యా! || 
;
చెరుకు గడలివిగోర! రావయ్య క్రిష్ణయ్య! ; 
చప్పరిస్తూ బాగ జుర్రుకోవయ్యా! 
మన్మధుని తండ్రివి, 
నీకు చప్పగా అనిపిస్తె -
ఏమి సేతుము? 
మేమేమి సేతుము! క్రిష్ణమ్మ! 
నీదు చిత్తము, మాదు భాగ్యాలు కన్నయ్యా! || 
;
వెన్నపూస, జున్ను,పాలివిగోర! క్రిష్ణా!
వీని గ్రోలక ఇతరులిళ్ళలొ 
ఉట్టి పయిని దుత్తలందలి
మీగడలకై దూలమ్ములెక్కెద 
వేమి సేతుము? 
మేమేమి సేతుము! క్రిష్ణమ్మ! 
నీదు చిత్తము, మాదు భాగ్యాలు కన్నయ్యా! || 

;*********************************************,

రాధామనోహరం (శీర్షిక: శ్రీ కృష్ణ భావలహరి) ; 

Friday, July 15, 2016

ఈ గీర అందుకనే!

వయ్యారి నెమలి సయ్యాటలాడేవు ; 
ఏమనీ? ఇటులెందుకనీ? ||
;
చిన్నారి క్రిష్ణయ్య వచ్చేను ఇటకు, 
అందుకనీ, ఈ తళుకు అందుకనే! ||
;
] పురి ఇంత భారీగ మోసేవు నువ్వు ; 
నయగారాల నెమలీ! గారాల మయూరీ! 
ఎందుకనీ? ఇటులెందుకనీ?           
ఏలనొకో? ఎందులకో? 2 || 
;
] మురిపాల క్రిష్ణమ్మ ఇటుకేసి వచ్చేను ; 
అందుకనీ, ఈ కులుకు అందుకనే! || 
;
] బర్హి పింఛము నిండ - 
వేల - పింఛము కనులు ;
 ......... దాల్చి ఆడేవు,  
ఏలనొకో? ఎందులకో? 2   ||
;
చిలిపి క్రిష్ణయ్య ; 
తన సిగనందు నన్నే ; 
తురుముకుని కదలును ; 
అందుకని , ఈ గీర అందుకనే! || 
;
[by ;- - కోణమానిని  ]

=====================================,
;
wayyaari nemali sayyATalADEnu ; 
Emanii? iTulemdukanii?  2 ||
;
chinnaari krishNayya wachchEnu iTaku, 
amdukanii, ii taLuku amdukanE! ||
] puri imta BAriiga mOsEwu nuwwu ; 
nayagaaraala nemalii! 
gaaraala mayUrI! 
emdukanee? iTulemdukanii?      || 
;
] muripaala krishNamma iTukEsi wachchEnu ; 
amdukanii, ii kuluku amdukanE! || 
;
] barhi pimCamu nimDa 
wEla pimCamu kanulu daalchi ADEwu, 
ElanokO? emdulakO?  2
;
chilipi krishNayya ; 
tana siganamdu nannE ; 
turumukuni kadalunu ; 
amdukani , ii geera amdukanE! || 
;
[ by ;- - kONamaanini  ]
;

Thursday, July 7, 2016

మువ్వల అల్లరి

కన్నుల నాట్యము ఆడగ రాదా ; 
              రారా! కృష్ణా! రారా! కృష్ణా!
మిన్నుల వెన్నెల కురిసెను నీకై;
             రారా! కృష్ణా! రారా! కృష్ణా!  ||
;
నవమల్లితోటలో మధుమాసమ్మువై ; 
తల్లి యశోద అధరపు మందహాసమ్మువై! ||
;
పల్లెలొ చిన్నెలుచిందులు వేసెను ; 
మువ్వలు కొల్లలు సందడి చేసెను ; 
ఎల్లరి మనసులు కొల్లగొనంగా ; 
నల్లని కృష్ణా! రారా! రారా! ||
============================,
;
kannula nATyamu ADaga raadaa ; raaraa! 
                              kRshNA! raaraa! kRshNA!
minnula wennela kurisenu neekai;raaraa! 
                              kRshNA! raaraa! kRshNA!  ||
;
nawamallitOTalO madhumaasammuwai ; 
yaSOda talli adharapu mamdahaasammuwai! ||
;
pallelo chinneluchimdulu wEsenu ; 
muwwalu kollalu samdaDi chEsenu ; 
ellari manasulu kollagonamgaa ; 
                        nallani kRshNA! rArA! rArA! || 
;
[ పాట  - బుక్ పేజీ 46 ]    :- మువ్వల అల్లరి = muwwala allari 

Saturday, July 2, 2016

వర సీమలు

వర సీమలు ఈ సీమలు ; 
శ్రీరాముల అడుగుజాడలను
హత్తుకున్న 'వందుకుని'* ;
అందుకనే -
||ఈ సీమలు వర సీమలు ||
;
త్వరపడక శాంతమ్ము ; 
నీతి మార్గమందున ; 
ప్రచులితముగ చరియిస్తూ ; 
వరలు తీరులను; "తీరుగ" - 
నేర్పినవి లోకులకు!
విశ్వ మానవాళికి జనులందరికిని 
ఈ లావణ్య లలిత పదముద్రల పద్మములు ||
జీవనాదర్శములకు, 
జీవిత చలనమ్ములకు ; 
వరలుగాను ఏర్పడుతూ ;
తృప్తిగాను ప్రజలకు ; 
అందినవీ మానవులకు 
మా వర రమ్య మధుర జలములు 
మా నవ రమ్య మధుర జలములు||
;
*****************************************,
1] అందుకనే = threfore , for that reason ;
2] హత్తుకున్న 'వందుకుని'* = 
; హత్తుకున్నవీ+అందుకుని' = take ; ; 
*****************************************,
[ fb ;- SRIRAAMAARAAMAM] [ రామసుధ ]

బిందుహారద్యుతి

మధువనమే మురిసెనే, మా ; 
మాధవ రాధా రాగ పవనమున || 
;
మందారము తన దోసిలి విప్పి ; 
పుష్పాదుల సింధూరమును ; 
రాధ నిలువు పాపిటను నిలిపినది || 
;
పీతాంబరు-బిగి కౌగిలిలోన 
అలసిన రాధిక కనకాంబరము
నుదుటి కుంకుమై వరలినది || 
;
నవమల్లిక, నవ కోమల స్వేద ; 
బిందు మౌక్తిక హార తరళములుగ ; 
రాధికా హృదయముపై మురిసినవి || 

************************************,

         bimduhaaradyuti [ pATa 46 pEjI 52] 

madhuwanamE murisenE, mA ; 
maadhawa raadhaa raaga pawanamuna || 
;
mamdaaramu tana dOsili wippi ; 
pushpaadula simdhuuramunu ; 
raadha niluwu paapiTanu nilipinadi || 
;
piitaambaru, bigi ; kaugililOna 
alasina raadhika kanakaambaramu
nuduTi kumkumai waralinadi || 
;
nawamallika, nawa kOmala swEda ; 
bimdu mauktika haara taraLamuluga ; 
raadhikaa hRdayamupai murisinawi || 

***********************************, 

List :- 
▼  ▼  ▼  2009 (173) ▼  August (19)
తెలి గోళ్ళు - వెన్నెల ప్రతి ఫలనము ; 
రాసలీలా లోలుని రూప విలాసము;
ఆ బాల గోపాలము (ఆటలుకాని ఆటలు)
వన మయూరి; చిరు గాలికి గిలి గింతల జిలిబిలి ; 
ముద్దు గుమ్మడు ; ధరణీకాంతుడు ; 
వటపత్ర శాయీ! -పింఛము నృత్యము

;బిందుహారద్యుతి ;- [ పాట 46 పేజీ 52] ;-
;

ధ్యాన భోగము

రామనామ మతి మధురము ఎప్పుడునూ! 
మతిని వీడ మెపుడు సంకీర్తన ధ్యాన భోగము || 
;
వేడుకునీ, వేడకుండ - గనె ; 
దొరికెను కద మనలకు ; 
రామయ్య మృదు నామము ;  ||
;
చరియింతుము మేమెపుడూ; వేడుకగా ;; 
రామ చరిత సుధా ఝరుల ; 
నిరతము ప్రవహించు వీడు* ఇది!
వీడమెపుడు, ఈ జాడల; 
ఉందు మిచట స్థిరముగా! ||
;
[ వీడు* = సీమ, భూమి ప్రాంతము ]
;
******************************************,
మది రత్నాల మేడ ;- [ రామసుధ ]
{{ లింక్:- The British Library's Ramayana miniatures - masterpieces of Hindu art, 
many painted by Muslims - 
are testimony to a time when religious relations on the subcontinent were less fraught, 
writes William Dalrymple 
;

వర భాగ్యములు

అరమరసేయకు అలసట బెట్టకు ; 
నయనము విప్పి కరుణను చూడరా!
కరివరదా! కరమందీయవా!? 
ఈ యెడ సేవాభాగ్యము లీయవ!?     || 
;
కస్తూరి మృగము కాళ్ళు పట్టి ; 
ప్రాధేయపడి పడీ, పొందాను 
ఇంత చిటికెడు కస్తూరి ; 
శ్రీవర తిలకము తీర్చు  
భాగ్యముల నీయరా! సన్నుతాంగా!  ||  
;
చిన్ని గంధపు చెక్క దెస్తిని ; 
వన్నె అగరు గంధ మిదియే! 
మోదమలరగ ; సమ్మోద మెగయగా 
మైపూతలను అలదనీరా, 
;                       చిన్ని కృష్ణా!  || 
;
========================,
;
aramara sEyaku alasata bettaku
nayanamu wippi karuNanu chUDarA! 
kariwaradA! karamamdIyawA!?    || 
;
kastUri mRgamu kaaLLu paTTi ; 
praadhEyapaDi paDI, 
pomdaanu imta chiTikeDu kastUri ; 
SrIwara tilakamunu tIichETi 
bhaagyammu liiyarA! sannutaamgA!  ||  
;
chinni gamdhapu chekka destini ; 
wanne agaru gamdha midiyE! 
mOdamalaraga ; sammOda megayagaa  
maipuutalanu aladaniiraa, chinni kRshNA!  || 

ఉయ్యాలలు

ముక్కోటి దేవతలు ముచ్చటల దేలుచూ; 
కోటిసూర్యప్రభలు  వెలుగొంద ;  
               నా స్వామి! ఊగ రావయ్యా! 
                      ఉయ్యాల లూగరావయ్యా!  || 

చిన్ని ప్రహ్లాదుని చెన్నుగా కాచేవు! 
వన్నెచిన్నెలు వాడె పన్నగము ఏలయ్య!? 
ఈ పసిడి శ్రీ డోల ఉండెను నీ కోసమే! 
              వేగ రావయ్య! ఊగ రావయ్యా!  || 
;
గజరాజు మొర వినుచు, పరుగులను తీసేవు ; 
ధావనము మేను క్లేశములు పొందెనో! 
ఈ బేల తల్లి వుంది నీ కోసమే! ;  
              వేగ రావయ్య! ఊగ రావయ్యా!  || 
;
=====================================,
;









#; 

mukkOTi dEwatalu muchchaTala dEluchuu; 
kOTisuuryaprabhalu  welugomda ; 
naa swaami! Uga raawayyA! uyyaala lUgaraawayyA!  ||
;
chinni prahlaaduni chennugA kaachEwu! 
wannechinnelu wADe pannagamu Elayya!? 
I pasiDi SrI DOla umDenu nii kOsamE! 
wEga rAwayya! Uga raawayyaa!  || 
;
gajaraaju mora winuchu, parugulanu teesEwu ; 
dhaawanamu mEnu klESamulu pomdenO! 
ii bEla talli wumdi nI kOsamE! ;  
wEga rAwayya! Uga raawayyaa!  || 
;
 [ పాట   - బుక్ పేజీ  44 ]  
అఖిలవనిత; 36237 - 873 posts, last published on Jun 29, 2016  

Wednesday, June 29, 2016

తాంబూలముల సీత

పుండరీకాక్షునికి ,
మారామ చంద్రులకు
భూపుత్రిక,సీత!
చిలకలీయుమా!!
తమలపాకుల చిలకలీయుమా!!! ||
;
మారాము చేసేటి మా రాములకు  
చనువుగా, గోముగా ;
చిలక పలుకుల కలికి!
చిలకలీయుమా!!
తమలపాకుల చిలకలీయుమా!!!  ||
;
నీలమోహన రామ;
ఆజానుబాహుని అరచేతులందున
ఆకువిడెమును ఉంచి ;
పసిడి నవ్వును ఉంచెను ;
అవనిజ, సిరి సీత || |
;
నీలవర్ణుని పెదవి ఎరుపుల ఉప్పొంగు
తాంబూల చర్వణం అరుణరాగములు;
అనురాగములు చిలుకు దాంపత్యశోభలకు
కస్తూరి, కర్పూర,  కాచు, పోకల కూర్పు
తాంబూల మడుపులు శ్రీ హారతి ||
;
========================,

    తాంబూలముల సీత

pumDarIkaakshuniki,
maaraama chamdrulaku
bhuu putrika seeta!
chilakaleeyumaa,
tamalapaaku chilakaleeyumaa!!!  ||
;
maaramu chEsETi maa raamulaku
chanuwugaa, gOmugaa ;
chilaka palukula kaliki!
chilakaleeyumaa,
tamalapaaku chilakaleeyumaa!!!  ||
;
neelamOhana raama;
aajaanubaahuni arachEtulamduna
aakuwiDemunu umchi;
pasiDi nawwunu umchenu
awanija, siri seeta ||
;
neelawarNuni pedawi erupula uppomgu
taambuula charwaNam aruNa raagamulu ;
anuraagamulu chiluku
daampatyaSOBalaku
kastuuri, karpuura, kaachu, pOkala kuurpu
taambuula maDupulu Sreehaarati ||
;
------ [taambuulamula seeta ]

తమాలపల్లవ శుక, శారికలు

నింగి అడపం నిండా: నీరదం పత్రాలు :
ఆ మబ్బు ఆకులను మడిచి,
           ఇచ్చేవారు ఎవ్వరమ్మా!?
గొబ్బున ఇచ్చు వారెవరమ్మా!? ||
;
తమలపాకు చిలకలను చేయు
చాతుర్యాలు ఎవ్వారివమ్మా?
;
చెలులు :- ఇంకెవ్వరివమ్మా!?
ఇంకెవ్వరికున్నది ఆ ప్రజ్ఞ, ఆ నేర్పు!?
- మన రాధకు తప్ప! ||
;
మెరుపుల వక్కలను సమకూర్చినది వనిత ;
వర్షధార "కాచు" రుద్ది; జలజముల "కిళ్ళీలను" ;
అలవోకగ చేసేను అపరంజి బొమ్మ
;                     మన అపరంజి బొమ్మ ||
;
శ్రావణ మేఘాల విడియాలు సిద్ధం, సిద్ధం ;
కర్పూరం తాంబూలం సిద్ధం, సిద్ధం ;
కోమలి కుడి చేతి వ్రేళ్ళ శిఖరములుగ;
తమాల పల్లవం బొమ్మలు ; సిద్ధం, సిద్ధం ;
ఎర్రెర్రని పెదవుల గూటిలోన దాచేటి ;
మురళీధర! నందబాల!
మా నల్లనయ్య! రావయ్యా! ||

=========================,

#nimgi aDapam nimDA: nIradAla patrAlu :
aa mabbu aakulanu maDichii; ichchE
wArewarammA!?
gobbuna ichchE wArewarammA!? ||
;
tamalapaaku chilakalanu;
chEsE chaaturyaalewwariwammaa?
imkewwariwammaa!?
;
imkewwari kunna damma aa praj~na, A nErpu!?
mana raadhaku tappa! ||
;
merupula wakkalu nu samakuurchinadi wanita;
wEsi; warshadhaara kaachu ruddi; jalajamula "kiLLIlanu" ;
alawOkaga chEsEnu ; mana aparamji bomma ||
;
SraawaNa mEGAla wiDiyaalu siddham, siddham ;
karpuuram taambuulam siddham, siddham ;
kOmali kuDi chEti wrELLa SiKaramuluga;

tamaala pallawam
bommalu ; siddham, siddham ;
errerrani pedawula; gUTilOna daachETi ;
muraLIdhara! namdabaala!
maa nallanayya! raawayyaa! ||
;
[ తమాలపల్లవ శుక, శారికలు ]

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
; రాధామనోహరం (శ్రీ కృష్ణ భావలహరి) ; October 3, 2015; 
అఖిలవనిత
Pageview chart 36180 pageviews - 870 posts, last published on Jun 25, 2016 - 

ksm - another song - :-

ముల్లోకములకు పారవశ్యము ;-
మంజుల వాణీ! శార్వాణీ! 
పినాక పాణి, హృదయ రాణివి! 
అమ్మా! నీ ఒడిలోన. ముల్లోకములు మైమరచేను! ||
అమ్మా! నీ తమాల పల్లవ కటాక్ష దృక్కుల 
ముల్లోకములు మైమరచేను! || 
తుషార మౌక్తిక ధవళ కాంతులు/ లను

Saturday, June 25, 2016

కన్నులలో లోకములు

"కంటిలోన నలకలేవొ పడినవమ్మ! ;
నా కంటిలోన నలకలేవొ పడినవమ్మ!”;
అనుచు నలుపబోకురా,
నల్లనయ్య! నలుపబోకురా  ||
;
నీ చల్లని వీక్షణముల ;
యుగములన్ని – క్షణములుగా ;
కరిగిపోవురా!  కృష్ణా! కరిగిపోవురా!  ||
;
రెప్ప కాస్త కందేనా –
క్షణములన్ని - యుగములుగా
నిలిచిపోవురా! కృష్ణా! నిలిచిపోవురా!
;
నీ కన్నుల బింబములలొ
ఈ సకల విశ్వ గోళమ్ములు ;
వేలాదిగ పొదిగి ఉన్నవనే  -
                          మాట మరిచి, నలుపబోకురా ;
చిన్ని కృష్ణా!! కన్నులు నలుపబోకురా!
కన్నులు నలుపబోకురా  ,
చేతులదిమిపెట్టి నలుపబోకురా!  

=========================================

                    kannulalO lOkamulu ;-  [ పాట 19 - బుక్ పేజీ 30 ]     :-

"kamTilOna nalakalEwo paDinawamma! ;
naa kamTilOna nalakalEwo paDinawamma!”;
anuchu nalupabOkurA, kannulu nalupabOkurA  ,
chEtuladimipeTTi nalupabOkuraa,
nallanayya! nalupabOkurA  ||
;
nii challani weekshaNamula ;
yugamulanni kshaNamulugaa ;
karigipOwurA! kRshNA! karigipOwurA!  ||
;
reppa kaasta kamdEnA –
kshaNamulanni - yugamulugaa –
nilichipOwurA! kRshNA!nilichipOwurA!  || ;
nii kannula bimbamulalo/ lOna ;
ii sakala wiSwa gOLammulu ;
wElAdiga podigi
unnawanE  maaTa marichi,
nalupabOkurA ; chinni kRshNA!! kannulu nalupabOkurA!

++++++++++++++++++++++++++++++++++
;
అఖిలవనిత
Pageview chart 36153 pageviews - 869 posts, last published on May 31, 2016 - 

కన్నులలో లోకములు ;-
కన్ను దోయి నులమ బోకురా! కృష్ణయ్యా! [పాట - 2]
తెలుగు వెబ్ దునియా  [ లింక్]
[ పాట 19 - బుక్ పేజీ 30
= kannulu nalupabOkurA!