Saturday, June 25, 2016

కన్నులలో లోకములు

"కంటిలోన నలకలేవొ పడినవమ్మ! ;
నా కంటిలోన నలకలేవొ పడినవమ్మ!”;
అనుచు నలుపబోకురా,
నల్లనయ్య! నలుపబోకురా  ||
;
నీ చల్లని వీక్షణముల ;
యుగములన్ని – క్షణములుగా ;
కరిగిపోవురా!  కృష్ణా! కరిగిపోవురా!  ||
;
రెప్ప కాస్త కందేనా –
క్షణములన్ని - యుగములుగా
నిలిచిపోవురా! కృష్ణా! నిలిచిపోవురా!
;
నీ కన్నుల బింబములలొ
ఈ సకల విశ్వ గోళమ్ములు ;
వేలాదిగ పొదిగి ఉన్నవనే  -
                          మాట మరిచి, నలుపబోకురా ;
చిన్ని కృష్ణా!! కన్నులు నలుపబోకురా!
కన్నులు నలుపబోకురా  ,
చేతులదిమిపెట్టి నలుపబోకురా!  

=========================================

                    kannulalO lOkamulu ;-  [ పాట 19 - బుక్ పేజీ 30 ]     :-

"kamTilOna nalakalEwo paDinawamma! ;
naa kamTilOna nalakalEwo paDinawamma!”;
anuchu nalupabOkurA, kannulu nalupabOkurA  ,
chEtuladimipeTTi nalupabOkuraa,
nallanayya! nalupabOkurA  ||
;
nii challani weekshaNamula ;
yugamulanni kshaNamulugaa ;
karigipOwurA! kRshNA! karigipOwurA!  ||
;
reppa kaasta kamdEnA –
kshaNamulanni - yugamulugaa –
nilichipOwurA! kRshNA!nilichipOwurA!  || ;
nii kannula bimbamulalo/ lOna ;
ii sakala wiSwa gOLammulu ;
wElAdiga podigi
unnawanE  maaTa marichi,
nalupabOkurA ; chinni kRshNA!! kannulu nalupabOkurA!

++++++++++++++++++++++++++++++++++
;
అఖిలవనిత
Pageview chart 36153 pageviews - 869 posts, last published on May 31, 2016 - 

కన్నులలో లోకములు ;-
కన్ను దోయి నులమ బోకురా! కృష్ణయ్యా! [పాట - 2]
తెలుగు వెబ్ దునియా  [ లింక్]
[ పాట 19 - బుక్ పేజీ 30
= kannulu nalupabOkurA!

No comments:

Post a Comment