Wednesday, August 1, 2018

పద గతి ఇది-స్వర లయ మది ముదమతి గొని

పద గతి ఇది-స్వర లయ మది
ముదమతి గొని, వరమీయమనీ ;
నీ చరణ శృతి చప్పుడు విని ;
గప్ చుప్ గా దాగేనని ఎటనో అని 
"మా మురిపాల బాల కన్నయ్యదే కద -
ఈ ఉనికి" అనీ ...... 
;
సవ్వడి తరి 'ఇవ్విరి వని'
విచ్చేసిన అగణితమౌ - 
వనితలదీ బహు సందడి ;
దడబిడగా గడ బిడ ఇది!

లే జవ్వని మువ్వల జడి - గువ్వల సడి
రా చిలకల , శుక 'కిళి కిళి'-
సీత కోకల హడావుడి ;
చివురుల ఒడి కిల కిల మని 
మరి మరి మరి ఒలికిన తఱి 
;
నిన్నటి దాకా - మౌనాంకిత బృందా వని!
నే్డేమో నిలువెల్లా సౌదామిని ;
ఇలాగిలాగీలాగున గిలిగింతలు ఈ ఇలకు!
అహహాహాహా! ఆహాహాహా ! 
;
అది కని,కని చకితంబై - యామినిలో -
యమునా నది తరగలపై ;
'వెన్నెల చలి కిరణమ్ముల కలముల'తో
వ్రాసెనులే నీలి నింగి .........
నవ్య లాస్య విలాస లాస
హావ భావ నాట్య చలన నర్తన లయ
ఝళం ఝళన ఘటిత ఘటన నట వేదము!
;
శ్రీ బాల కృష్ణ! నీ క్రీడా సంరంభము
మాకందిన పారిజాత మకరందము
ఇల, భక్త కోటి కొసగినట్టి ;
సాహితీ కల్ప తరుల సౌరభములు! 

No comments:

Post a Comment