Tuesday, December 6, 2016

కోమలీ!

పల్లవ తను వల్లరీ! రాధికా! కోమలీ! 
అల్లన జాబిలి చేసెను అల్లరి ;   || 

జిలిబిలి జిలిబిలి ఆ అంబరము ; 
తొలి తొలి వలపుల చెలిమి - మన కోసం ; 
సిరి సిరి వెన్నెల మన సొంతం ; 
సరి సరి సరిగమ ఆసాంతం ;  || 

పరిమళ భరితము ఈ విశ్వం ; 
దరిశన మొసగెను సౌందర్యం ; 
పరిసర కాంతులు ప్రేమలకు ; 
కులుకుల పరిచయ వేదికలైనవి ; 
నీ ఒడియే మరకత ఆసనము ; 
నీ ఒడియే నాకు - 
          అతిశయ శోభిత సింహాసనం ;  || 

పరిణత పొందిన దొక కలిమి ; 
విరళత చూపిన దొక చెలిమి ; 
విరి శర తాడిత కృష్ణునికి ; 
తడిసిన తాంబూల మైనదిలే! ; 
నీ నగవే నాకు కర్పూర విడియం ;  ||

▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
;
                   kOmalI!  ;- 

pallawa tanu wallarI! raadhikA! kOmalI! 
allana jaabili chEsenu allari ;   || 

jilibili jilibili aa ambaramu ; 
toli toli walapula chelimi - mana kOsam ; 
siri siri wennela mana somtam ; 
sari sari sarigama aasaamtam ;  || 

parimaLa bharitamu ii wiSwam ; 
dariSana mosagenu saumdaryam ; 
parisara kaamtulu prEmalaku ; 
kulukula parichaya wEdikalainawi ; 
nee oDiyE marakata aasanamu ; 
nee oDiyE naaku - 
 atiSaya SOBita sim haasanam ;  || 

pariNata pomdina doka kalimi ; 
wiraLata chuupina doka chelimi ; 
wiri Sara tADita kRshNuniki ; 
taDisina tAmbuula mainadilE! ; 
nee nagawE naaku karpuura wiDiyam ;  ||
;
 [ పాట 103 ; బుక్ పేజీ 108  , శ్రీకృష్ణగీతాలు ]

▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼

No comments:

Post a Comment