Monday, December 12, 2016

నగు మోము

నగు మోము చూపక నన్నేడిపిస్తావు; 
పాట చాలును కృష్ణా! :
'తేనె రస శాల'లో పరవశాల తేల ; 
కృష్ణా! పరవశాల తేల ; ||
;
ముందు జన్మములోన ఒడలెల్ల చిల్లులుగా చేసుకుని ; 
మురళి - తపమాచరించెను ; నీ అరచేత చేరేను; 
అది, గారాలు పోయేను! ; బహు గారాలు పోయేను! : ||
;
తెలిసినది కిటుకు, తెలిసెను లోగుట్టు ; 
తొలి వ్రతము నే చేసి, వేణువే ఔతాను ; 
నీ వేలి ముద్రలు , ముద్రల ముద్దులు నే పొందుతాను ; 
వే వేలుగా నేను పొంది తీరెదను, కృష్ణా! || 
;
==================,

             nagu mOmu ;- 
;
nagu mOmu chUpaka nannEDipistAwu; pATa chAlunu kRshNA! :
'tEne rasa SAlalO parawaSAla tEla ; kRshNA! parawaSAla tEla ; ||

mumdu janmamulOna oDalella chillulugA chEsukuni ; 
muraLi - tapamaacharimchenu ; nee arachEta chErEnu; 
adi, gaaraalu pOyEnu! ; bahu gaaraalu pOyEnu! : ||

telisinadi kiTuku, telisenu lOguTTu ; 
toli wratamu nE chEsi, wENuwE autAnu ; 
nee wEli mudralu , mudrala muddulu nE pomdutaanu ; 
wE wElugaa nEnu pomdi teeredanu, kRshNA! || 
బృందావనమే రాధామనోహరం... 
[ పాట 114  ;  బుక్ పేజీ 119  , శ్రీకృష్ణగీతాలు ]  
;

No comments:

Post a Comment