Tuesday, January 17, 2012

రాజసమొప్పే బొమ్మల కొలువులు
కొలువులు కొలువులు;                   ;        మేటి కొలువులివి,
రాజ కొలువులను మించినట్టివి;
రాజసమొప్పే బొమ్మల కొలువులు

బుల్లి ఊరును నిర్మిద్దాము
ఇది మన ఇల్లు; ఇది మన ఊరు
ఈ బొమ్మలు అన్నీ మన ఫ్యామిలీ!

మురికీ, మురుగు లేని దారులు,
వీధి లైట్లతో కళకళకళలాడే మార్గాలన్నిట
అన్ని వృత్తుల జన సమ్మర్దము!

అటు ఆఫీసులు, ఆసుపత్రులు,
రైల్వే స్టేషను, బస్టాండు, షాపులు;
ఇదిగో ఇక్కడ జూ, పార్కులలో,
మైదానాలలొ ఆడే పిల్లలు;

&&&&&&&&&&&&&&&&&&


రాజసమొప్పే బొమ్మల కొలువులు;( Link:- New AvkAya)

Member Categories - బాల
Written by kadambari piduri  
Monday, 16 January 2012 11:32No comments:

Post a Comment