Thursday, October 13, 2011

థాయ్ లాండ్ తెప్ప పండుగ


థాయ్ లాండ్ లో అనేక ఆసియా దేశాలలో వలెనే, 
చాంద్రమానము వాడుకలో ఉన్నది.
Thai traditional calender ప్రకారము -12 వ నెలలో -
అనగా ఇంచుమించు నవంబర్ లో
"లొయ్ క్రథాంగ్" పండుగ (Loy Krathong) ను చేస్తారు.
థాయ్ ప్రజలు ఈ వేడుకను పౌర్ణిమ నాడు చేస్తారు.
"Loy" అంటే "తేలాడుట" అని అర్ధము.
క్రథాంగ్ - అంటే "తెప్ప"(Krathong) అని అర్ధము.
అరటి చెట్టు బెరడు పొరలతో, చారెడు దొప్పలను చేస్తారు.
రొట్టెతో, ధర్మొకోల్ వంటి మెత్తని వానితో/ styrofoam తోనూ
ఇలాగ జానెడు దొప్పలను (a hand span in diameter) చేస్తారు.
చెరువులలోనూ, నీళ్ళలోనూ వీటిని వదులుతారు.
;
థాయ్ లాండ్ కార్తీక దీపాలు
థాయ్ లాండ్ ప్రజలు "జల దేవత"ను కొలుస్తూ, ఇలాగ పర్వం చేస్తారు.
Goddess of rivers and waterways, Mae Khongkha వారు కృతజ్ఞతలను 
చెప్పే సాంప్రదాయిక పర్వము ఇది.
మన కార్తీక దీపాల ఉత్సాహ పండుగ వంటిదే ఇది.
థాయ్ ప్రజలు "Goddess of Water, Phra Mae Khongkha" ను భక్తితో  కొలుస్తారు.
దిఇనినే ఆధునిక సాంకేతిక పరిభాషలో - "పర్యావరణ పూజ" అని పేర్కొనవచ్చు.
హిందూ మహిళలు దివ్వెలను పెడ్తారు.
కార్తీక దీపం సంబరము- నోము వలె ఉన్న Traditional festival.
;
థాయ్ లాండ్ "తెప్ప"పండుగ  ;
ఉత్సాహము; ఫెస్టివల్ ;

;




No comments:

Post a Comment