Thursday, September 29, 2011

టిబెట్ లో యోగి, Milerapa

















యోగి మిలెరపా, గొప్ప కవి.
1052  సంవత్సరములో  Mila-Dorje-Sengeవంశములో
జన్మించిన మహా పురుషుడు "మిలెరప యోగి".

Milarepa 1052 - 1135 మధ్య కాలము వాడు.
టిబెట్ ప్రజలు ఆరాధించే మహనీయుడు.
వజ్రయానమును (బౌద్ధ మత)
ప్రజాబాహుళ్యములో వ్యాప్తి చేసిన వ్యక్తి.

మిలెరపా యోగి 

అతని పాటలు, టిబెట్ మున్నగు దేశాలలో ప్రసిద్ధికెక్కినవి.
85 సంవత్సరాల వయసునాటికి,
మిలెరపా యోగి, 25 మంది శిష్యులు-
ఆతని అనుయాయులు,
బౌద్ధ గురు మిలెరపా గీతములను,
సుభాషితాలను నేర్చుకున్నారు.
వారి గురు భక్తి, ఆధ్యాత్మక కృషి ఎనలేనిది.
మిలెరపా సూక్తులు
నేటికీ అనేక ప్రాంతాలలో భజన కూటమిలలో
ఆలపించబడుతూ ఉన్నవి.
ఈ ఛాయాచిత్రము- Milerapa cave.
నేడు ఈ పరిసరములు చీనా ఆక్రమించినది.
ఐనప్పటికీ, చైనా దేశము- కొంత పహారాలో-
ఈ ప్రదేశాన్ని పర్యాటక యోగ్యంగా మార్చి, నిర్వహిస్తూన్నది.

*******************************\\\\\\

White Rock Horse Tooth cave -  తెలుసా? 
Milarepa's Cave (Link 1)
;
Tibetan's poet saint Milerapa
;

No comments:

Post a Comment