
ఇంతులూ, పిల్లలూ, ముద్దరాళ్ళు 
బంగారు కలశాల - భమిడి పళ్ళాలలో
బతుకమ్మ పూ మేడలను కట్టి తెచ్చేరు
దసరాకు సంబరం పిలుపు పేరంటం    ||
తంగేడు పూలనూ తీర్చి పేర్చేరమ్మ – 
రంగుగా, హంగుగా తల్లి బతుకమ్మా!
బీర పువులూ, కట్ల పువులు, బంతులనూ
నేర్పుగా పేరుస్తు గద్దియను కట్టేరు
సూర్య కిరణ కోటి, చంద్ర కాంతులునూ 
ఏడు వరుణాల హరి విల్లులున్నూ  
పోటీలు పడుతూను ఈ పూల కురిచీల - పయి 
                   నెక్కి కూర్చుంటాయి 
 
బంగారు, మణి రత్న, నెమలి సింహాసన్లు 
ఈ సుకుమార చక్కనీ గద్దె సాటికి రావు
అమ్మ మా బతుకమ్మ! ఆసీనవై మమ్ము
కమ్మనీ నవ్వులతొ దీవెనల నీవమ్మ!
 
**************************************  
iMtuluu, pillaluu, muddaraaLLu
baMgaaru kalaSAla - BamiDi paLLAlalO
batukamma pU mEDalanu kaTTi techchEru
dasaraaku saMbaraM pilupu pEraMTaM    || 
taMgEDu pUlanuu tiirchi pErchEramma – 
raMgugaa, haMgugaa talli batukammaa!
bIra puvuluu, kaTla puvulu, baMtulanuu
nErpugaa pErustu gaddiyanu kaTTEru
sUrya kiraNa kOTi, chaMdra kaaMtulunuu
EDu varuNAla hari villulunnuu  
pOTIlu paDutUnu I puula kurichIla - payi 
nekki kUrchuMTAyi. 
 
baMgaaru, maNi ratna, nemali siMhaasanlu 
I sukumaara chakkanii gadde saaTiki raavu
amma maa batukamma! aasiinavai mammu
kammanI navvulato dIvenala nIvamma!
*******************************************
 
No comments:
Post a Comment