
[తాత]:
చిట్టి పాపా! చిన్ని బాబూ!
బొమ్మలు ఏవీ చూపించండి! ||
[బాల బాలికలు ]:
బార్బీ, డిస్నీ, లక్క పిడతలు
బాలు,బ్యాటు, నిర్మల్ బొమ్మలు
ఆడీ ఆడీ – ఇపుడే అటకను సర్దేశాము
[తాత]:
చిన్న బాబూ! చిట్టి బాలా!
మీ బుక్కులు ఏవీ? ఎక్కడ ఉన్నయ్?
విజ్ఞానానికి అవి ప్రతీకలు    ||
[బాల బాలికలు ]:
కార్టూన్, కామిక్స్, నీతి గాథలు
పద్యాల్, పాటలు,సైన్సు, లెక్కలు
అన్నీ నేర్చి, అలమర్లో సర్దేసాము    ||
[తాత]:
పళ్ళు, ఫలాలు, ఫలహారాలూ
ఎక్కడ ఉంచారోయి గడుగ్గాయిలూ!
[బాల బాలికలు ]:
బాదం, పిస్తా, డ్రై ఫ్రూటులు
శ్రీ రాముల నేస్తం – బుల్లి ఉడుతకు;
నవ ధాన్యాలు గువ్వ, పిచుకలకు;
పెరుగు కడీలు పుస్సీ క్యాటు పిల్లికి;
దోర జామలు రామ చిల్కలకు;     
బుజ్జగిస్తూ మరి తినిపించాము         ||
[తాత]:
“ స్వీటు హాటులూ, అప్పచ్చు లరిసెలు
చప్పరింపుల చాక్లెట్లూ
మరి నాకేవీ మనవళ్ళూ!”        ||
[బాల బాలికలు ]:
“జొన్న కండెలు, జంతిక, చెక్కలు
బోసి నోటి తాతా! ఇవిగో! 
అన్నీ నీకే!భుజించవయ్యా!”      ||
[తాత]:
“నమలడానికి పళ్ళే లేవు;
మీ పరిహాసాలు ఎంతో ముద్దు! 
బొజ్జ నిండుగా హాస్యపు విందులు
నాకు చాలును, అవె పది లక్షలు!”           
సరదా సరదా తీపి పలుకులు 
 
No comments:
Post a Comment