Sunday, February 14, 2010

రామ లాలి... మేఘశ్యామ లాలి

-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-


ఊపండి, ఊపండి ఉయ్యాలలు ;
పాడండి, పాడండి జోల పాటలు ||

ఉయ్యాల తొట్టిలో ఉంగ ఉంగా అనుచు ;
జానకి పవళించె ,
ఊపవమ్మా జనక మహ రాజ పత్నీ! ||

ఛిన్నారి తల్లికి సిరి తిలకమెట్టి
కన్నుల కాటుకలు ఇంపార తీ
ర్చిగాజుల రవళులు జావళీ వినిపించ
కనకంపు హారాలు నాట్యాలు సాయంగ
ముస్తాబు చేయండి,ఇంతులార! ||


గోరింట బొమ్మలు అరిచేత –
నవ్యహరి - చందనాలను మేనెల్ల అలది
శ్రీ చందనాలను దివ్యంగ పామి,

అతివలూ! ||

గంధాలు అంతంత మెత్త బోకండీ!
శ్రీ రాఘవులు కలలోన గాంచి
మనసులో ఎంతెంతొ నొచ్చుకుంటారు
లక్ష్మణుడు ధ్వజమెత్తి, ఉరికి వస్తాడు

భరత, శత్రుఘ్నులు ఊరుకోరండీ!
కౌసల్య,సుమిత్ర,కైకేయి అత్తలు
తర్జనిలు చూపించి,హెచ్చరిస్తారు
;గంధాలు అంతంత మెత్తకండి!

గోరంత గంధము ఘుమ ఘుమలు కొండంత;
చిటికెడు గంధము - సిరి సంపదల్లు హిమ శృంగమెత్తు;
చిటి పాప చిరు నవులు,
గాలికి దొరికెను గొప్ప కొల బద్దలు ;
మిథిలా పురి నుండి – అయోధ్యా నగరికి
ఎంత దూరం ఉందొ – మలయ పవనములార! కొలిచి చెప్పండి!

రామ లాలి... మేఘశ్యామ లాలి

By kadambari piduri, Feb 5 2010 5:09AM )

No comments:

Post a Comment