Sunday, January 3, 2010

కోలాటములకు పునాది!


రేపల్లె గళములోన - చేరెను ' రోహిణి తారక '
శ్రావణాల పట్టీ - అష్టమిలో పుట్టీ
ఏమి సందడీ - ఈ గోకులాష్టమి!

మారు మూల పల్లెలోన - జోరు జోరు పాటలు
వ్రేపల్లియ ఐనది - కోలాటమాట పునాది!

వెన్నెల కిరణాల్లార! - ప్రత్యూషా రేఖలార!
చేయి చేయి కలుపుకునీ - జారి, జారి, ఇలకు రండి!
మీ పెన వేసిన కిరణాలు నేర్చు- కోలాటము లాటలను !

No comments:

Post a Comment