Friday, December 4, 2009

బాలకృష్ణుని పాల అడుగులు


రేపల్లె పుట్టినింట - ఆ అడుగు దమ్ములెవరివే?
ఆ పద పద్మము గరిమలు - స రి గ మ - పద స్వరములే!

(అను పల్లవి):::
ఆ జాడలు రాధవీ! - కృష్ణాష్టమి నాడు ఇలను
మోహన శ్యాముని చరణ ముద్ర లందున
తన " గమనము" గమకములై ఒప్పు తీరు చూడరే! ||

1.ముక్కున నత్తున మణులు - పాపిట బిళ్ళల రవ్వలు
కాంతులెన్నొ వెద జల్లెను - ఈ చోద్యము చూడరే!-

"దొంగ"అనుచు,పట్ట బోవు - వనితలకు చిక్క కుండ
కన్నయ్యకు దారి చూపు ప్రజ్ఞలే!
మన రాధికవి - బహు చమత్కార ప్రజ్ఞలే ||

2.తన నడకలే నాట్యాలు! - పెదవి విరుపులేమో
వేణువునకు అందించే - సరి కొత్త రాగములే!
మురళి ఊదు చున్నాడు- యశోద గారాల పట్టి
మన- రాధ చేయి పట్టినట్టి ఘనుడు వీడు!
ఔనౌనే! వీడు కాక ఎవరంట? ||

No comments:

Post a Comment