Wednesday, September 16, 2009

నీలికలువల మాలిక

---
---
అపరంజి ఊయెలందున పవ్వళించి కేరింత లాడు చుండ -
"బంగారు మొల త్రాడు ఒత్తుకొనె నయ్యయ్యొ !
నాదు - బంగారు తండ్రికి !"అనుచు,
మానసమెంతొ తల్లడిలగ
నీదు నడుముకు ముద్దు లేపనమ్ముల నలదె అమ్మ . -

ఒత్తుకొనిన నీ నడుముపైన
కమిలి ,డాగుల అచ్చు ముద్రలను కనుగొనిన
తేటి గుంపులు వ్రాలె, సంతసముగ - -
"నీలి కమలమ్ముల తోరణమ్ముల"నుచు ఎంచి!!!

"హుష్! హుష్ష"నుచు- మాత యశోద
కీటకమ్ముల నవలకు తొలగ త్రోయు లోపల
' భ్రమర జాతరల' నవలోకించుచున్న
"వాసంత రా రాణి"
వేగిర పడి, తానె దిగి వచ్చె సంభ్రమమున
కటిక గ్రీష్మములను వైదొలగ జేసి.
ఋతు ఆగమన సూచిక గంద్ర గోళమవగా -

బ్రహ్మ"ఇది ఏమి వ్యత్యస్త కాల మహిమ !"అనుచు
తత్తర పడుచుండ ,వీక్షించి .

( Baala నీలికలువల మాలిక ::::; )
By kadambari piduri, Sep 6 2009 5:40AM

No comments:

Post a Comment