Friday, May 6, 2016

ఎవ్వరనీ ? ఎవ్వరనీ ?

అగాధ లోయల మౌన గాధలను 
గుప్పించిన వారెవ్వరనీ?
పెనుశిలలందున వెన్నెల ద్రావక వన్నియలను ; 
సొంపుగ పారే క్రియ ఎవ్వరిదీ?
పైరుల పచ్చలు వెదజల్లీ, 
పుడమికి నగవుల సొత్తును అప్పగించినవారు ఎవ్వరో! 

*****************************,

ఎర్రని ముక్కు రామచిలుకను ; 
ప్రేమతోడ ముద్దాడినది దెవ్వరనీ!?
వెన్నెల వెన్నను కరిగించీ ; 
హిమపర్వతములకు 
మలాము పూతల 
శోభిల్లజేసినవారు ఎవ్వరనీ ? 

*****************************,

యమునా వాహిని బారు జడలలో? ; 
వలయపు సుమముల తేలాటలవేనా!? 
జడముగ ఉన్న జలముల నంతగ ;
అందము చిందిన ఆ సోయగముల - కళా క్రీడలు, 
కళకళలాటలు, రాసక్రీడలు - తెలిసినది!

గోపీక్రిష్ణుల జలక్రీడల సొగసులు;
తేలుతు తిరిగే పూదండలు అవగా ;
మన అందరి కనులు యవనికలే కద!
మనో నేత్రములు 
పరిమళార్ణవముల అద్దములాయెను ;  
ఓహోహో !!!!!! 
;
*****************************,

errani mukku raamachilukanu ; 
prEmatODa muddADinadi dewwaranee!?
wennela wennanu karigimchii ; 
himaparwatamulaku ; malaamu puutala 
SOBillajEsinawaaru ewwaranee ? 

*****************************,

yamunaa waahini baaru jaDalalO? ; 
walayapu sumamula tElATalawEnA!? 
jaDamuga unna jalamula namtaga ;
amdamu chimdina aa sOyagamula - kaLA kreeDalu, 
kaLakaLalATalu, raasakreeDalu, telisinadi!
gOpiikrishNula jalakreeDala sogasulu;
tElutu tirigE puudamDalu awagaa ;
mana amdari kanulu yawanikalE kada!
manO nEtramulu 
parimaLaarNawamula addamulaayenu ;  
OhOhO !!!!!!

-; [ కుసుమాంబ ]
అఖిలవనిత
Pageview chart 35688 pageviews - 847 posts, last published on May 6, 2016 

No comments:

Post a Comment