Thursday, May 26, 2016

గోవర్ధనాల గోవింద క్రిష్ణా!

గోవర్ధనాల గోవింద క్రిష్ణా!
వంశీ కృష్ణా! మురళీధారీ!   || 
;
భాండీర వనము సర్వము ; 
మధుర గాన కలశమైనది!
వేణురవళీ సుధలు నిండుగ ; 
త్రుళ్ళెడి కాంచన  కలశమైనది! 
గోవర్ధనాల గోవింద క్రిష్ణా!
వంశీ కృష్ణా! మురళీధారీ!   ||  
;
నిదుర లేచి, ఒడలు విరిచి, 
మెటిక చిటికెలు చిటుకుమను మును 
చిట్టి డమరుక ధ్వనులు అవగా ; 
విరించి, ఈశులు వంగి చూచుచు ; 
అంబరమున అట్టె నిలువగ; 
వారి నడుములు పట్టుకొనగా;  
పత్నులకు గుబులాయెరా!    .............. 
;
శారద,  భవాని మాతలు, 
పతుల బాగోగులను గూర్చి, కూరుచుండి, 
కూరిమి చర్చించుకొనుచూ, 
,                         బయలుదేరిరి, 
నిన్ను బాగా నిలదీయుచు,  
,            మెండుగా ప్రశ్నించవలెనని     || 
================================,
;
gOwardhanaala gOwimda krishNA!
wamSii kRshNA! muraLIdhArI!   || 
BAmDIra wanamu sarwamu ; 
madhura gaana kalaSamainadi!
wENurawaLii sudhalu nimDuga ; 
truLLeDi kaamchana  kalaSamainadi! 
gOwardhanaala gOwimda krishNA!
wamSii kRshNA! muraLIdhArI!   || 
;
nidura lEchi, oDalu wirichi, 
meTika chiTikelu chiTukumanu munu;
chiTTi Damaruka dhwanulu awagaa ; 
wirimchi, iiSulu wamgi chuuchuchu ; 
ambaramuna aTTe niluwaga; 
waari naDumulu ;  paTTukonagaa; 
patnulaku gubulaayerA! 
Saarada,  Bawaani maatalu, 
patula baagOgulanu guurchi, kuuruchumDi, 
kuurimi charchimchukonuchuu, 
bayaludEriri, ninnu baagaa niladiiyuchu, 
memDugaa praSnimchawalenani ||       
;
,,,,,,,,,,,,, [  extra ; + page 24 ]

No comments:

Post a Comment